Indian 2 | ఇండియన్ 2 అప్డేట్.. ఇంతకీ షూటింగ్ ఎక్కడంటే..?
కమల్ హాసన్ (Kamal Haasan) నటిస్తోన్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ఇండియన్ 2 (Indian 2). శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది.
Indian 2 | టాలెంటెడ్ యాక్టర్ కమల్ హాసన్ (Kamal Haasan) నటిస్తోన్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ఇండియన్ 2 (Indian 2). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం తమిళనాడులోని కల్పాక్కమ్ డచ్ పోర్టులో షూటింగ్ కొనసాగుతోంది. కమల్ హాసన్‌తోపాటు ఇతర యాక్టర్లపై వచ్చే కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇటీవలే యాక్షన్ అండ్ స్టంట్ డిజైనింగ్ టీంతో కమల్ హాసన్ డిస్కషన్స్ చేస్తున్న ఫొటో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితులైన బాబీ సింహా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇండియన్ 2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్-రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లపై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్.
శంకర్ ఇండియన్ 2 షూటింగ్‌తోపాటు మరోవైపు రాంచరణ్‌తో చేస్తున్న ఆర్సీ 15 షూటింగ్ కూడా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. కమల్ హాసన్ ఇండియన్ 2తోపాటు మణిరత్నం డైరెక్షన్లో 234వ ప్రాజెక్ట్‌ను కూడా లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, కమల్ హాసన్ హోం బ్యానర్లపై తెరకెక్కిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

