ఉప్పెన సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి..బ్లాక్ బాస్టర్ హిట్టందుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej). ప్రస్తుతం అంగరంగ వైభవంగా సినిమాలో నటిస్తుండగా..విడుదలకు రెడీ అవుతోంది. కాగా ఈ యాక్టర్ నాగవంశి నిర్మాతగా సితార ఎంటర్టైన్ మెంట్స్ (Sithara Entertainments)బ్యానర్లో నాలుగో సినిమాకు కూడా సైన్ చేశాడు. మరో ఆసక్తికర విషయమేంటంటే ఇదే బ్యానర్ వైష్ణవ్ తేజ్ సోదరుడు సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej)తో మాస్ ప్రాజెక్టును ప్రకటించింది.
అదే రోజు వైష్ణవ్ తేజ్‌తో భారీ స్థాయిలో తెరకెక్కబోతున్న చిత్రాన్ని కూడా ప్రకటించారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ దర్శకత్వం వహించనున్నాడు. పక్కా మాస్ యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈమూవీ రానుండగా..ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్ లో కనిపించిన వైష్ణవ్ తేజ్ తొలిసారి మాస్ యాంగిల్‌ను చూపించబోతున్నాడట. హైదరాబాద్‌లో జూన్ 22న ఈ సినిమా లాంఛింగ్ సెర్మనీ ఉండబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
ఈ ప్రాజెక్టులో హీరోయిన్గా ఎవరు కనిపించబోతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. మొత్తానికి వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడక్షన్స్ హౌస్ గా కొనసాగుతున్న సితార మెగా హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
Read Also : ఆదిపురుష్ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభాస్..?
Read Also : Ajith Road Trip | బీఎండబ్ల్యూ బైక్‌పై రోడ్ ట్రిప్..ట్రెండింగ్‌లో అజిత్ స్టిల్స్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Also : Vishwak Sen | యాక్షన్ కింగ్ డైరెక్షన్లో విశ్వక్సేన్..కాంబో అదిరింది
Read Also : Jr NTR | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..!