టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) కాంపౌండ్ నుంచి త్వరలో రాబోతున్న ప్రాజెక్టు పక్కా కమర్షియల్ (Pakka Commercial). గోపీచంద్ (Gopichand ), రాశీఖన్నా (Raashi Khanna) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై ఎస్కేఎన్, బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నాడు.
ప్రతీ రోజు పండగే సినిమా తర్వాత రాశీఖన్నాను మరోసారి రిపీట్ చేయడం వెనుకున్న కారణమేంటో చెప్పుకొచ్చాడు మారుతి. ‘నిజం చెప్పాలంటే పక్కా కమర్షియల్ సినిమాకు రాశీఖన్నా ఫస్ట్ ఛాయిస్ కాదు. ప్రతీ రోజు పండగే చిత్రంలో రాశీఖన్నా టిక్ టాక్ స్టార్‌గా కనిపించింది. అయితే ఆ పాత్ర లెంగ్తీ రోల్ కాదు. అందుకే ఆమెకు నేను చేయబోయే కొత్త సినిమాలో పూర్తి స్థాయిలో ఉండే పాత్ర ఇవ్వాలనుకున్నా. అయితే పక్కా కమర్షియల్‌కు మాత్రం ఆమె పేరు పరిగణనలోకి తీసుకోలేదు అన్నాడు మారుతి ‘.
‘చాలా మంది హీరోయిన్లను గోపీచంద్‌కు జోడీగా అనుకున్నాం. ఆ హీరోయిన్లంతా తమ తమ సినిమాల కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడంతో మేము రాశీఖన్నాను సంప్రదించాం. ఆమె వెంటనే ఓకే చెప్పేశారు. ప్రత్యేకించి ఈ వ్యక్తులే అని పెట్టుకోకుండా అందుబాటులో ఉన్న నటీనటులతో సినిమా చేయాలని ఫిక్సయ్యా. రాశీఖన్నా నా మొదటి ఛాయిస్ కాదు..కానీ ఆమెనే బెస్ట్ ఛాయిస్ అయ్యారంటూ చెప్పుకొచ్చాడు’ మారుతి. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ డైరెక్టర్. గోపీచంద్-రాశీఖన్నా కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ఈ ఇద్దరు లాయర్లుగా కనిపించబోతున్నారు.
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Also : Vishwak Sen | యాక్షన్ కింగ్ డైరెక్షన్లో విశ్వక్సేన్..కాంబో అదిరింది
Read Also : Jr NTR | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..!