బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Sharukh Khan) నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్‌ల్లో ఒకటి పఠాన్ (Pathaan). సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా..జాన్ అబ్రహాం కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా పఠాన్ టీజర్‌ను నవంబర్ 2న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2023 జనవరి 25న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఇప్పటికే పఠాన్ నుంచి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందన వస్తోంది. పఠాన్ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. దీపికా-షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో పఠాన్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
దీపికా పదుకొనే దీంతోపాటు ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్టు కేలో కీ రోల్లో నటిస్తోంది. షారుఖ్ ఖాన్ మరోవైపు జవాన్, డుంకీ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
Read Also : SS Rajamouli | ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్కు అవార్డు.. వీడియో
Read Also : Sardar 2 | మిషన్ కంబోడియా త్వరలో షురూ.. కార్తీ టీం సర్దార్ 2 వీడియో వైరల్
Read Also : Rajinikanth | నాకు గూస్బంప్స్ తెప్పించారు.. కాంతార సినిమాపై రజినీకాంత్