మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 09:34:32

ఈ వారం నామినేష‌న్‌లో ఆ ఏడుగురు

ఈ వారం నామినేష‌న్‌లో ఆ ఏడుగురు

సోమ‌వారం వ‌స్తే ఎలిమినేష‌న్‌కు సంబంధించి నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌డం కామ‌న్. ఈ వారం జ‌రిగిన నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఏడుగురు స‌భ్యులు ఉండ‌గా, వారిలో ఎవ‌రు ఇంటిని వీడ‌నున్నార‌నేది ఆస‌క్తిగా మారింది. సోమ‌వారం ఎసిపోడ్ గోంగూర తోట కాడ కాపుకాశా అనే పాటతో మొద‌లైంది. ఆ త‌ర్వాత మార్నింగ్ మ‌స్తీలో భాగంగా స్వాతీ దీక్షిత్ మిగ‌తా ఇంటి స‌భ్యుల‌కు న‌వ‌ర‌స‌రాలు నేర్పించింది. శంగార ర‌సం అభిజిత్‌తో చేయ‌గా, విషాదం నోయ‌ల్‌తో చేసింది. తండ్రి పాత్రని నోయ‌ల్ పోషించ‌గా, ఆయ‌న చ‌నిపోయిన క్ర‌మంలో స్వాతి వెక్కి వెక్కి ఏడ్చింది. అది చూసి మోనాల్ కూడా కంట క‌న్నీరు పెట్టుకుంది.

భీబ‌త్సం  ర‌సం పండించేందుకు నోయ‌ల్‌- లాస్య రంగంలోకి దిగారు. వీరిద్ద‌రు ప‌ర్‌ఫార్మెన్స్‌కు అంతా ఫిదా అయ్యారు. గ‌ట్టిగా గట్టిగా అరుస్తూ త‌మ త‌మ పాత్ర‌ల‌లో తెగ జీవించేశారు.  ఇక ఆ త‌ర్వాత దివి నామినేష‌న్ విష‌యంలో మెహ‌బూబ్ తో పాటు అభిజిత్‌తో చ‌ర్చించింది. అనంతరం అవినాష్‌.. అరియానాతో రొమాంటిక్ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌గా, ఆ త‌ర్వాత మోనాల్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళాడు . అక్కడ కొంత సేపు హాస్యం పండించి అంద‌రిని న‌వ్వించాడు.

ఇక బిగ్ బాస్ నామినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లు పెట్ట‌గా ఇందులో సోహైల్ - అఖిల్ హిట్‌మ్యాన్‌లుగా ఉంటార‌ని తెలిపాడు. వీరిద్ద‌రికి త‌లో ఐదు వేలు ఇచ్చిన బిగ్ బాస్, మిగ‌తా ఇంటి స‌భ్యుల‌కు ప‌దివేలు ఇచ్చారు. బ‌జ‌ర్ మోగిన ప్ర‌తి సారి లివింగ్ ఏరియాలో ఉన్న ఇంటి స‌భ్యులు హిట్ మెన్‌లు ఉన్న రూంకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎవ‌రైతే ముందుగా వెళ‌తారో వారికి నామినేష‌న్ చేసే అవ‌కాశం దక్కుతుంది. ఇందులో మొత్తం ఐదు బ‌జర్స్ మోగుతాయి. అవి మోగిన ప్ర‌తి సారి డెన్‌కు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక హిట్ మ్యాన్స్‌కు సంబంధించిన బ‌జ‌ర్ కూడా మోగుతుంది. ఆ బ‌జ‌ర్ మోగిన‌ప్పుడు ఎవ‌రైతే గ‌న్ చేజిక్కించుకుంటారో వారికి ఇంటి స‌భ్యుల ద‌గ్గ‌ర ఉన్న ప‌దివేలు ద‌క్కించుకునే అవ‌కాశం ఉంటుంది 

 నాలుగో వారం నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా ముందు అమ్మ రాజ‌శేఖ‌ర్ వెళ్ళి.. స్వాతి దీక్షిత్‌ను నామినేట్ చేశారు. ఆ త‌ర్వాత  మెహబూబ్ వెళ్లి.. అభిజిత్‌ని, అరియానా గ్లోరి.. లాస్యని, హారిక‌.. మెహబూబ్‌ని ,  సుజాత.. కుమార్ సాయిని నామినేట్ చేశారు. నామినేట్ చేసిన వాళ్ళు వారికి అనిపించిన రీజన్స్ హిట్ మ్యాన్స్‌తో చెప్ప‌గా ఈ విష‌యాన్ని వీరు వెళ్లి నామినేట్ అయిన వాళ్ళ‌కు చెప్పారు. అయితే హిట్ మెన్లుగా ఉన్న అఖిల్, సొహైల్‌లలో నాలుగు సార్లు గన్‌ని చేజిక్కించుకుని అఖిల్ సేవ్ అయ్యాడు. సోహైల్ నామినేష‌న్ బోర్డ్ త‌గిలించుకున్నాడు.   

ఇక అఖిల్‌కు మ‌రోసారి అవ‌కాశం ఇచ్చాడు బిగ్ బాస్. మ‌రొక‌రిని నామినేట్ చేయ‌మ‌ని చెప్ప‌గా, అత‌ను హారిక‌ని నామినేట్ చేశాడు. త‌ను ప్ర‌తి విష‌యంలో దూరుతుంద‌నే కార‌ణంతో నామినేట్ చేసిన‌ట్టు పేర్కొన్నాడు. దీంతో ఈ వారం   హారిక, స్వాతి దీక్షిత్, అభిజిత్, లాస్య, మెహబూబ్, కుమార్ సాయి, సొహైల్  ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.  మూడో వారం ఇంటి నుండి బ‌య‌ట‌కు వెళ్ళిన దేవి ఇచ్చిన బిగ్ బాంబ్ తో అరియానా ఈ వారం సేవ్ అయిన విష‌యం తెలిసిందే.  


logo