గోల్కొండ హైస్కూల్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా సినీ కెరీర్‌ను మొదలుపెట్టాడు సంతోష్ శోభన్ (Santosh Shobhan). ఆ తర్వాత హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఈ యువ హీరో తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా కథలు ఎంపిక చేసుకుంటూ.. సినిమాలు చేస్తున్నాడు. ప్రేక్షకులు ఆహ్లాదభరితంగా ఫీలయ్యే తాజా కథలతో వినోదాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
సంతోష్ శోభన్ నటించిన మంచి రోజులొచ్చాయి (Manchi Rojulochaiae), ఏక్ మినీ కథ మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఈ సినిమాలు సంతోష్ శోభన్ కు గుర్తింపునిచ్చి.. హీరోగా ట్రాక్‌పైకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్లో లైక్ షేర్ అండ్ సబ్ స్రైబ్ (Like Share & Subscribe) సినిమా చేస్తున్నాడు సంతోష్ శోభన్. ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. జాతిరత్నాలు ఫేం హీరోయిన ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న లైక్ షేర్ అండ్ సబ్ స్రైబ్ నవంబర్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ టాలెంటెడ్ హీరో టాప్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ లో రెండు సినిమాలకు సంతకం చేశాడు. మరోవైపు స్వప్న సినిమా బ్యానర్లో నందినీ రెడ్డి దర్శకత్వంలో అన్ని మంచి శకునములే మూవీ చేస్తున్నాడు.
వీటితోపాటు పలు ఓటీటీ ప్రాజెక్ట్‌లను కూడా లైన్లో పెట్టాడు. ఇప్పటికే ది గ్రిల్, ది బేకర్ అండ్ ది బ్యూటీ ఓటీటీ సిరీస్‌ల్లో కూడా మెరిశాడు సంతోష్ శోభన్. మొత్తానికి సంతోష్ శోభన్ ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ ప్రాజెక్ట్‌లు చేస్తూ కొత్తదనంతో కూడిన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించడం కోసం ఫుల్ బిజీగా ఉండటం ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
Read Also : SS Rajamouli | ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్కు అవార్డు.. వీడియో
Read Also : Sardar 2 | మిషన్ కంబోడియా త్వరలో షురూ.. కార్తీ టీం సర్దార్ 2 వీడియో వైరల్
Read Also : Rajinikanth | నాకు గూస్బంప్స్ తెప్పించారు.. కాంతార సినిమాపై రజినీకాంత్