Sandeep Raj | కలర్‌ఫొటో సినిమాతో డైరెక్టర్‌గా మంచి ఫేం సంపాదించాడు సందీప్ రాజ్ (Sandeep Raj). షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ మొదలుపెట్టిన ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ డెబ్యూ సినిమాగా ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది కలర్‌ఫొటో. డైరెక్టర్‌గా, రైటర్‌గా కెరీర్ కొనసాగిస్తున్న సందీప్ రాజ్ పర్సనల్ లైఫ్‌లో కీలక ముందడుగు వేయబోతున్నాడన్న వార్త ఒకటి ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
తాజా టాక్ ప్రకారం సందీప్ రాజ్ క్లాసికల్ డ్యాన్సర్ చాందిని రావును పెండ్లి చేసుకోబోతున్నారని ఇండస్ట్రీ సర్కిల్ టాక్. ఈ కపుల్ నవంబర్ 11న వైజాగ్‌లో నిశ్చితార్థం జరుపుకోనున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 7న తిరుపతిలో వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నట్టు ఇన్సైడ్ టాక్. అయితే వెడ్డింగ్ న్యూస్‌పై సందీప్ రాజ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
చాందినీ రావు కలర్‌ఫొటో, రణస్థలి, హెడ్ అండ్ టేల్స్‌తోపాటు పలు వెబ్ సిరీస్‌లలో నటించించింది. చాందిని రావు ప్రొడక్షన్ హౌస్‌ను కూడా మెయింటైన్ చేస్తుంది. సందీప్ రాజ్ ప్రస్తుతం రోషన్ కనకాలతో Mougli సినిమా ప్రకటించాడని తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ షురూ కానున్న ఈ చిత్రం 2025లో విడుదల కానుంది.
KA | కిరణ్ అబ్బవరం క చిత్రానికి సూపర్ క్రేజ్.. ఓటీటీ, శాటిలైట్స్ ఎంత పలికాయో తెలుసా..?
Lucky Baskhar Twitter Review | దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్‌గా ఇంప్రెస్ చేశాడా..?
Rashmika Mandanna | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా.. వివరాలివే