NBK 109 | నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటిస్తోన్న తాజా చిత్రం ఎన్బీకే 109 (NBK109). బాబీ (Bobby) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. కాగా దీపావళికి ఎన్బీకే 109 టైటిల్ అనౌన్స్మెంట్ ఉండబోతుందని ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించే విషయం చెప్పాడు నిర్మాత నాగవంశీ .
లక్కీ భాస్కర్ ప్రమోషన్స్‌లో నాగవంశీ మాట్లాడుతూ.. బాలకృష్ణ సినిమా పోస్టర్లు వేస్తే ఆ కిక్కు రాదని.. పండుగకు టైటిల్, విజువల్స్ కలిపి అనౌన్స్ చేద్దామనుకున్నాం. ఆ విజువల్స్ కు చాలా సీజీ పార్ట్ ఉంటుంది. సీజీ సమయానికి సిద్దం కాలేదు. అందుకే కొంచెం ఆలస్యమవుతుంది. అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా. టైటిల్‌ను ఆ విజువల్స్, బ్యాంగ్‌తో ఇస్తేనే మీకు హైప్ వస్తుందని డైరెక్టర్ బాబీ రెడీ చేశారు. సీజీ పనులకు పదిరోజులు పట్టొచ్చని చెప్పారు నాగవంశీ .
ఈ నేపథ్యంలో బాలయ్య అభిమానులు మరికొన్ని రోజులు ఆగాలన్నమాట. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Rashmika Mandanna | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా.. వివరాలివే
Singham Again | అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ నయా రికార్డ్.. ఏంటో తెలుసా..?
Zebra | సత్యదేవ్ జీబ్రా కొత్త విడుదల తేదీ వచ్చేసింది..