KA | టాలీవుడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కాంపౌండ్ నుంచి చేసిన సరికొత్త ప్రయత్నం క (KA). సుజిత్-సందీప్ డైరెక్షన్లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నారు. దీపావళి కానుకగా నేడు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదలైంది. ప్రమోషనల్ కంటెంట్ పెంచిన హైప్‌తో క పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. కాగా ఓ వైపు థియేటర్లలో సందడి చేస్తుండగా.. అప్పుడే ఓటీటీ అప్డేట్ వచ్చేసింది.
తాజా సమాచారం ప్రకారం క చిత్రం పోస్ట్ థ్రియాట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ తెలుగు ప్లాట్‌ఫాం ఈటీవీ విన్ దక్కించుకుంది. అంతేకాదు శాటిలైట్ రైట్స్ ఈటీవీ గ్రూప్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. మేకర్స్ ఈ రెండు రైట్స్ ద్వారా రూ.10 కోట్లు ఆర్జించినట్టు ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. ఈ లెక్కన కిరణ్ అబ్బవరం భారీగా పెరిగిందనే చెప్పొచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ట్రైలర్లో వాసుదేవ్‌గా కనిపించిన కిరణ్ అబ్బవరం..ఈ ఊరేంటి చాలా విచిత్రంగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడిపోతుందని వాసుదేవ్ ఓ గ్రామస్థుడిని అడిగితే.. మా ఊరు చుట్టూ ఎత్తెన కొండలుంటాయి. కొండల మధ్యలో మా ఊరుంటుంది. మధ్యాహ్నం మూడయ్యే సరికి సూర్యుడు కొండల వెనక్కి వెళ్లిపోయి.. ఆ నీడ మా ఊరి మీద పడి 3 గంటలకే చీకటి పడిపోతుందబ్బాయి.. చీకటి వలయం.. గందరగోళం.. ఏప్రిల్ 22 1977 ఆ రోజు నీకొచ్చిన ఉత్తరాన్ని తెరిచి చదివావు. అందులో ఏముంది.. అంటూ సాగుతున్న ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి శ్యా్మ్ సీఎస్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.
Lucky Baskhar Twitter Review | దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్‌గా ఇంప్రెస్ చేశాడా..?
Rashmika Mandanna | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా.. వివరాలివే