ఇండస్ట్రీలో మరో విషాదం.. జాతీయ ఉత్తమ నటుడు కన్నుమూత

సినిమా ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణం జరిగింది. జాతీయ ఉత్తమ నటుడిగా కీర్తి ప్రతిష్టలు అందుకున్న కన్నడ నటుడు సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. రెండు రోజుల కింద ఈయన యాక్సిడెంట్ కు గురయ్యాడు.ఆ ప్రమాదంలో ఆయన తల, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ఆయనకు సర్జరీ కూడా చేసారు. అయిన ఫలితం మాత్రం దక్కలేదు. అప్పటికే తలలో రక్తం గడ్డ కట్టడంతో పాటు తీవ్ర రక్తస్రావం కూడా జరగడంతో ఈయన రెండు రోజుల తర్వాత కన్నుమూసారు. సంచారి విజయ్ మృతితో కన్నడ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. చాలా చిన్న వయసులోనే ఈయన అందర్నీ విడిచి వెళ్లిపోయాడంటూ అభిమానులు కూడా బాధ పడుతున్నారు.
కన్నడ స్టార్ హీరో సుదీప్ ఈ మరణవార్తను ధృవీకరించారు. జూన్ 12 రాత్రి విజయ్ స్నేహితుడిని కలిసి బైకుపై తిరిగి తన ఇంటికెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సంచారి విజయ్ ఆరోగ్య పరిస్థితి మొదట్నుంచి విషమంగానే ఉన్నట్టు ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్ మీడియాకు తెలిపారు. మెదడులో రక్తం గడ్డకట్టిందని, ఆయనకు శస్త్రచికిత్స చేశామని, మరో 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని పేర్కొన్నారు. అంతలోనే ఈయన మరణవార్త బయటికి వచ్చింది. 2015లో నేషనల్ అవార్డు అందుకున్నవిజయ్.. లాక్ డౌన్ టైంలో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించారు. సంచారి విజయ్ చనిపోయాడని తెలిసిన తర్వాత సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.కాగా, తమ కుటుంబం ఆయన అవయవాలను దానం చేయాలని నిర్ణయించినట్లు విజయ్ సోదరుడు సిద్దేశ్ వెల్లడించారు
ఇవి కూడా చదవండి..
ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ కార్డు.. ఇలా అప్లై చేయండి
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
Alert : తెలంగాణకు నాలుగు రోజుల వర్ష సూచన
నేటి నుంచి పట్టాలెక్కనున్న ప్రత్యేక ట్రైన్లు
దేశ రాజధానిలో అందుబాటులోకి రష్యా టీకా
మరోవారం లాక్డౌన్ పొడగింపు.. ఎక్కడంటే?
సైబర్ దాడులతో ఎలాంటి ముప్పు లేదు : కేంద్రం
హైదరాబాద్లో పలు చోట్ల భారీ వాన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

