Samantha | టాలీవుడ్ యాక్టర్లు నాగచైతన్య-సమంత (Samantha) నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంలో సమంత, నాగార్జునకు చాలా మంది సినీ ప్రముఖులు మద్దతుగా నిలిచారు. తాజాగా మరోసారి ఈ కామెంట్స్‌పై స్పందించింది సామ్.
వరుణ్ ధవన్‌తో కలిసి నటిస్తున్న సిటడెట్ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా కొండాసురేఖ వ్యాఖ్యల గురించి ఓ రిపోర్టర్ సామ్‌ను అడిగాడు. దీనికి సామ్ స్పందిస్తూ.. కొండాసురేఖ కామెంట్స్‌ను మరోసారి తీవ్రంగా ఖండించింది. తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలియజేసింది. తన చుట్టూ ఉన్న వారి వల్లే సమస్యలను ఎదుర్కొనగలిగానని సామ్ పేర్కొంది.
సామ్ ఇప్పటికే ఈ వివాదంపై స్పందిస్తూ.. నేను సినీ ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వపడుతున్నా. ఇండస్ట్రీ మహిళలను చిన్నచూపు చూడటం మానేయండి. ఇలాంటి గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే చాలా శక్తి కావాలి. విడాకులు నా వ్యక్తి గత విషయం. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. నేనెప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటా. మీరు గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉన్నారు. మీ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు. మా విడాకుల విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. ఇతర వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని కొండాసురేఖకు సూచించిన విషయం తెలిసిందే.
Unstoppable With NBK | బాలకృష్ణతో సూర్య, దుల్కర్ సల్మాన్ సందడి.. క్రేజీ వార్త వివరాలివే
Rakul Preet Singh | వెన్ను నొప్పిని లెక్కచేయలే.. ఆరు రోజులుగా బెడ్పైనేనన్న రకుల్ ప్రీత్ సింగ్
Matka | కూల్ స్పాట్ క్లబ్ చూశారా..? వరుణ్ తేజ్ టీం నుంచి మట్కా నయా గ్లింప్స్