Citadel Trailer | తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు సమంత (Samantha). ఈ భామ నటిస్తోన్న వెబ్ ప్రాజెక్ట్ సిటడెల్ (Citadel: Honey Bunny). బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్ హీరోగా నటిస్తున్నాడు. సిటడెల్ ఇండియన్ వెర్షన్‌గా వస్తున్న ఈ వెబ్ ప్రాజెక్ట్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. సిటడెల్ నవంబర్ 7న పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియోలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా ప్రీమియర్ కానుంది.
ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. స్టంట్‌మ్యాన్ బన్నీ, హనీ చుట్టూ తిరిగే కథాంశంతో వెబ్ ప్రాజెక్ట్ ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశారు డైరెక్టర్లు. ట్రైలర్ ఫన్నీ ట్రాక్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అద్భుతమైన విజువల్స్‌తో సాగుతూ.. వెబ్ ప్రాజెక్ట్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం పక్కా అని చెప్పకనే చెబుతోంది. సమంత మరోసారి తనలోని డిఫరెంట్ షేడ్స్‌ను చూపించబోతున్నట్టు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది.
రాజ్-డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టులో కేకే మీనన్, సిమ్రన్, సోహం మజుందార్, శివంకిత్ పరిహార్, కశ్వీ మజుందార్, సాఖిబ్ సలీం, సికిందర్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సిటడెల్ను రాజ్& డీకే D2R Films బ్యానర్‌పై నిర్మి్స్తున్నారు. ఈ వెబ్ మూవీకి రాజ్&డీకే, సీతా మీనన్ కథనందించారు.
Veera Dheera Sooran | ఐ ఫోన్లో తీసిన పోస్టర్ అట.. విక్రమ్ వీరధీరసూరన్ లుక్ వైరల్
They Call Him OG | అందమైన లొకేషన్లో ఓజీ షూటింగ్.. ఇంతకీ పవన్ కల్యాణ్ టీం ఎక్కడుందో..?
Ka | కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్.. క విడుదలయ్యేది అప్పుడే
Kanguva | సూర్య కంగువ తెలుగు, తమిళం ఆడియో లాంచ్.. ముఖ్య అతిథులు వీళ్లే..!