బాలీవుడ్ స్టార్లు విక్కీకౌశల్, కత్రినాకైఫ్ (Katrina Kaif) డిసెంబర్ 9న పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ సవాయి మదోపూర్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ (Six Senses Hotels Fort Barwara) బర్వారాలో వెడ్డింగ్ (Katrina Vicky Wedding) కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా వెడ్డింగ్‌కు సల్మాన్‌ఖాన్ అండ్ కుటుంబసభ్యులకు వెడ్డింగ్ అందలేదని బీటౌన్‌లో ఓ వార్త హల్చల్ చేస్తోన్న విషయం తెలిసిందే.
అయితే సల్మాన్ ఖాన్ వెడ్డింగ్‌కు వెళ్లే విషయంలో క్లారిటీ లేకున్నా..అతడి బాడీ గార్డు షేరా (Shera) మాత్రం తప్పకుండా పెళ్లి వేడుకలో ఉండబోతున్నాడట. అదేంటి అనుకుంటున్నారా..? కత్రినా-విక్కీ కౌశల్ పెళ్లివేడుకకు సెక్యూరిటీ ఏర్పాట్లను షేరా దగ్గరుండి చూసుకోబోతున్నాడని బీటౌన్ వర్గాల సమాచారం. టైగర్ సెక్యూరిటీ పేరుతో కంపెనీ నడుపుతున్న షేరా తన టీం మెంబర్స్ తో కలిసి కత్రినా-విక్కీ పెళ్లి వేడుకకు ఛార్జ్ తీసుకోతున్నాడని టాక్. అంటే సల్మాన్ ఖాన్ వెడ్డింగ్ వచ్చినా, రాకున్నా అతడి బాడీగార్డు రావడం మాత్రం పక్కా అని తెలిసిపోతుంది.
అంతేకాదు బీటౌన్ సెలబ్రిటీలు, వీఐపీల కదలికలను ఎప్పటికపుడు పర్యవేక్షించేందుకు బర్వారా పోలీసులు కూడా డ్యూటీలో ఉండబోతున్నారని తెలుస్తోంది. తాజా అప్ డేట్ ప్రకారం విక్కీకౌశల్-కత్రినా పెళ్లికి 120 మంది అతిథులు ఫైనల్ అయ్యారు.
ఇవి కూడా చదవండి..
Vicky katrina Wedding Updates | విక్కీకౌశల్-కత్రినా వెడ్డింగ్ అప్డేట్స్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్