గురువారం 28 మే 2020
Cinema - May 14, 2020 , 15:46:22

ఆర్జీవీ సమర్పణలో మియా మల్కోవా.. క్లైమాక్స్‌

ఆర్జీవీ సమర్పణలో మియా మల్కోవా.. క్లైమాక్స్‌

సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఏం చేసినా సంచలనమే. తనని విమర్శించే వారిని ఇంతైనా పట్టించుకోకుండా తన దారిలో తాను వెలుతూ సంచలనాలకు కేరాఫ్‌గా మారారు. ఆ మద్య కాలంలో పోర్న్‌ స్టార్‌ మియా మల్కోవాతో ‘గాడ్‌ సెక్స్‌ ట్రూత్‌' అనే వీడియోను రూపొందించి ఎంతో చర్చకు దారి తీసారు రాంగోపాల్‌ వర్మ. అయితే ఈ రోజు మళ్ళీ మరో బాంబు పేల్చాడు ఆర్జీవీ. తన అభిమానుల కోసం మరో చిత్రాన్ని మియా మల్కోవాతో రూపొందిస్తున్న ఆర్జీవీ ఆ చిత్రం గురించి మరిన్ని విషయాలను ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. నిన్న ఒక ట్వీట్‌లో తన అభిమాన నటి మియా మల్కోవాతో ైక్లెమాక్స్‌ అనే త్రిల్లర్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాను అంటూ, అందులో మియా మల్కోవా నటన ఎంతో బాగా చేసిందంటూ ట్వీట్‌ చేసారు. అందులో షూటింగ్‌ సమయంలోని పలు చిత్రాలను పంచుకున్నారు ఆర్జీవీ. అయితే ఈ సినిమాకు సంబందించి టీజర్‌ను ఈ రోజు 5 గంటలకే విడుదల చేస్తున్నట్లు కౌంట్‌ డౌన్‌ మొదలుపెట్టేసారు ఆర్జీవీ..  logo