రాధే ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. రిలీజ్ ఇప్పట్లో లేనట్లే అన్న సల్మాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న రాధే మూవీ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ రంజాన్‌కే మూవీ రిలీజ్ అవుతోందని తెగ సంబరపడ్డారు. అయితే సల్లూ భాయ్ మాత్రం వాళ్లకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. కొవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాధేను వచ్చే ఏడాది రంజాన్‌కే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు అతడు చెప్పాడు. నిజానికి ఈ మూవీ గతేడాది రంజాన్‌కే రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా మహమ్మారి వల్లే రిలీజ్‌ను ఈ ఏడాదికి వాయిదా వేశారు. మే 13న రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.
రాధే రిలీజ్‌పై సల్మాన్ ఏమన్నాడు?
ఈ మధ్య జరిగిన ఓ బుక్ లాంచ్‌లో రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ మూవీ రిలీజ్‌పై సల్లూ భాయ్ మాట్లాడాడు. రాధేను ముందే రిలీజ్ చేయాలనుకున్నాం. ఇప్పటికీ మూవీని ఈద్‌కు రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ లాక్డౌన్ ఇలాగే కొనసాగితే మాత్రం రిలీజ్‌ను వచ్చే ఈద్‌కు వాయిదా వేయాల్సి రావచ్చు. కానీ ప్రజలు మాత్రం ప్రభుత్వం సూచించిన అన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. మాస్కులు తప్పకుండా పెట్టుకోవాలి. భౌతిక దూరం పాటించాలి అని సల్మాన్ చెప్పాడు. అలా చేస్తే కొవిడ్ రెండో దశ త్వరలోనే సమసిపోతుందని, తన మూవీ రిలీజ్ అవుతుందని అన్నాడు. లాక్డౌన్ల వల్ల రోజు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఆ పరిస్థితి రాకుండా అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలనీ సూచించాడు. మూవీ రిలీజ్ కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమని సల్మాన్ స్పష్టం చేశాడు. దేవుడి దయ ఉంటే ఈ ఈద్‌కే రాధే రిలీజ్ అవుతుందని కూడా అతడు అన్నాడు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ మూవీ.. సౌత్ కొరియా సినిమా అవుట్లాస్కు రీమేక్.
ఇవి కూడా చదవండి..
ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక్కడ వద్దు.. మహా సీఎంకు వాంఖడే నివాసితుల లేఖ
భారత్ ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం
కోవిడ్ మూలాల గురించి మళ్లీ దర్యాప్తు చేపట్టండి..
నెల రోజుల్లోనే.. 79 వేల మంది చిన్నారులకు కరోనా
బంగ్లాదేశ్ టూర్‌కు ఆర్మీ చీఫ్
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ప్రధాని మోదీ
యూకేలో ‘ఆస్ట్రాజెనెకా’ వ్యాక్సిన్‌పై కీలక నిర్ణయం
ఐఐటీ రూర్కీలో 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

