Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
Iran vs US | పశ్చిమాసియా (West Asia) లో ఘర్షణలు ముగించేలా పాకిస్థాన్ (Pakistan).. అమెరికా-ఇరాన్ (USA-Iran) మధ్య రాయబారం కొనసాగిస్తున్నది. అయితే సంధిపై ముందుకు వెళ్లే క్రమంలో తమ షరతులను పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ (Pakistan Army Chief) ఆసిమ్ మునీర్ (Asim Munir) కు ఇరాన్ స్పష్టంగా తెలియజేసింది.
Iran vs US : పశ్చిమాసియా (West Asia) లో ఘర్షణలు ముగించేలా పాకిస్థాన్ (Pakistan).. అమెరికా-ఇరాన్ (USA-Iran) మధ్య రాయబారం కొనసాగిస్తున్నది. అయితే సంధిపై ముందుకు వెళ్లే క్రమంలో తమ షరతులను పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ (Pakistan Army Chief) ఆసిమ్ మునీర్ (Asim Munir) కు ఇరాన్ స్పష్టంగా తెలియజేసింది. తాము శుద్ధిచేసిన యురేనియాన్ని (Enriched uranium) వేరే దేశానికి తరలించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
శుద్ధి చేసిన యురేనియంలో ఒక్క గ్రాము కూడా ఇరాన్ నుంచి బయటకు వెళ్లదని ఇరాన్ జాతీయ భద్రతామండలి కార్యదర్శి మొహసెన్ రెజాయీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తమకు నమ్మకం కుదిరేలా అమెరికా చర్యలు తీసుకునే వరకు ఎలాంటి చర్చలు ఉండవని పేర్కొన్నారు. ఇరాన్ విధించిన అన్ని షరతులను నెరవేర్చడంతోనే ఆ చర్చల ప్రక్రియ ప్రారంభం కావాలని అభిప్రాయం వ్యక్తంచేశారు. మధ్యవర్తిత్వం కోసం ఇరాన్ వెళ్లిన జనరల్ మునీర్‌కు కూడా మొహసెన్ ఇదే విషయాన్ని స్పష్టంచేశారు.
హర్మూజ్ జలసంధి విషయంలో ఎలాంటి గందరగోళ వైఖరి లేదని, అమెరికా తమ షరతులు అంగీకరించేంత వరకు హర్మూజ్ మూసే ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గత హామీలను అమెరికా గౌరవించేవరకు కొత్తగా చర్చలు ఏమీ ఉండవని తేల్చిచెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
రకుల్ ప్రీత్ అందాల విందు.. బ్లూ శారీలో స్టన్నింగ్ లుక్‌తో కట్టిపడేస్తోందిగా!
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

