Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Thallapeta clashes | తాళ్లపేటలో కాంగ్రెస్ నాయకుల మధ్య పరస్పర దాడుల్లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు వర్గానికి చెందిన పలువురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. వరుస ఘర్షణలతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల బైపాస్ రోడ్డులో పోలీసులు భారీగా మోహరించారు.
Thallapeta clashes | మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 21: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో కాంగ్రెస్ నాయకుల మధ్య మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయని తెలిసిందే. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు వర్గానికి చెందిన నేత ఆకుల దుర్గాప్రసాద్‌పై ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్‌ను చికిత్స నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా పరస్పర దాడుల్లో ఎమ్మెల్యే వర్గానికి చెందిన పలువురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. వరుస ఘర్షణలతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల బైపాస్ రోడ్డులో పోలీసులు భారీగా మోహరించారు.
డీసీపీ భాస్కర్, ఏసీపీ, సీఐలు, ఎస్ఐలతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి అయ్యప్ప స్వామి ఆలయం వరకు పోలీసులు పహారా కాస్తున్నారు. వాహనాల రాకపోకలను ఒకవైపు మాత్రమే అనుమతిస్తూ, మరోవైపు బారికేడ్లు ఏర్పాటు చేశారు. జగన్ మోహన్ రావు అరెస్టుకు రంగం సిద్ధమైందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పీఎస్ఆర్ వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు జగన్ మోహన్‌రావు ఇంటిపై దాడికి పాల్పడే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో పోలీసులు అప్రమత్తమైనట్లు సమాచారం.
అయితే ఈ ప్రచారంపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. బైపాస్ రోడ్డులో పెద్దఎత్తున పోలీసుల మోహరింపుతో స్థానికుల్లో ఉత్కంఠ నెలకొంది. ఘర్షణలకు గల కారణాలు, గాయపడిన వారి వివరాలు, తదుపరి పరిణామాలపై స్పష్టత రావాల్సి ఉంది.
Read Also :
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ప్రమాదాలు జరిగిన పట్టించుకోరా..? రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలంటూ ధర్నా
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
రకుల్ ప్రీత్ అందాల విందు.. బ్లూ శారీలో స్టన్నింగ్ లుక్‌తో కట్టిపడేస్తోందిగా!
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

