ప్రమాదాలు జరిగిన పట్టించుకోరా..? రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలంటూ ధర్నా
ధ్వంసమైన రోడ్డుపై ప్రయాణిస్తుంటే నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరిగి గాయాల పాలవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రం ప్రధాన రహదారిపై ఆదివారం గ్రామస్తులు ధర్నా రాస్తారోకో చేపట్టారు.
హత్నూర,అక్టోబర్18 : ధ్వంసమైన రోడ్డుపై ప్రయాణిస్తుంటే నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరిగి గాయాల పాలవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రం ప్రధాన రహదారిపై ఆదివారం గ్రామస్తులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దౌల్తాబాద్ నుండి హత్నూర ఐటిఐ వరకు 8 కిలోమీటర్ల మేర తారురోడ్డు పూర్తిగా ధ్వంసమై భారీ ఎత్తున గుంతలు పడ్డాయన్నారు. ధ్వంసమైన రోడ్డుపై నిత్యం వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ గాయాల పలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డుపై ఏర్పడ్డ గుంతలో పడి గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు.
నిత్యం ఆ రోడ్డు గుండా వెళ్లాలంటే ప్రయాణికులు జంకుతున్నారని ఆరోపించారు. అడుగడుగునా భారీ ఎత్తున గుంతలు పడడంతో గుంతలను తప్పించబోయి ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కింద పడుతూ గాయాలపాలవుతున్నరని అయినా ప్రభుత్వం మరమ్మతులు చేపట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరారు. విషయం తెలుసుకున్న హత్నూర పోలీసులు అక్కడకు చేరుకుని ధర్నా విరమింప చేశారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

