Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Shreyas Iyer: కివీస్‌తో రేపటి నుంచి టీ20 సిరీస్ జరగనున్నది. అయితే తుది జట్టులోకి వైభవ్ సూర్యవంశీ ఇప్పట్లో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీనిపై కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ క్లారిటీ ఇచ్చారు. అభిషేక్, సంజూ మంచి ఫామ్‌లో ఉన్నారని అయ్యర్ చెప్పారు.
క్రైస్ట్‌చర్చ్ : న్యూజిలాండ్‌తో గురువారం నుంచి అయిదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభంకానున్నది. దీని కోసం భారత బృందం క్రైస్ట్‌చర్చ్ చేరుకున్నది. అయితే ఈ సిరీస్‌లో యువ డాషింగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో స్థానం సంపాదించే అవకాశాలు అనుమానంగా ఉన్నాయి. దీనిపై టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని, ఆ ఇద్దరి జోడీ చెలరేగి ఆడుతోందని, ఇలాంటి సమయంలో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే అవుతుందని కెప్టెన్ శ్రేయాస్ తెలిపారు. ఇటీవల ఇంగ్లండ్, ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌కు కూడా సూర్యవంశీని ఎంపిక చేశారు. కానీ గత 21 మ్యాచుల్లో అతను కేవలం 8 మ్యాచుల్లో మాత్రమే ఆడాడు.
గత 21 మ్యాచుల్లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఇద్దరూ రెగ్యులర్ ఓపెనర్లుగా రాణిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఇండియా వరల్డ్‌కప్ గెలవడంలో ఈ టీ20 బ్యాటర్లు కీలక పాత్ర పోషించారు. సూర్యవంశీ లాంటి ట్యాలెంట్ ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్ వద్ద గడపడం చాలా ముఖ్యమైన అంశం అవుతుందని, అతనికి అది సంతోషాన్ని ఇస్తుందని అయ్యర్ అన్నారు. అతను చాలా చిన్న వయస్కుడు అని, అవకాశాలు రావడానికి అతనికి ఇంకా చాల సమయం ఉందని, ప్రస్తుతం అతను నేరుగా జట్టులోకి రాలేడని, ఎందుకంటే మన ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారని, వాళ్లు వరల్డ్‌కప్ గెలిచి పెట్టారని కూడా శ్రేయాస్ తెలిపారు.
ఏషియన్ గేమ్స్‌లో మాత్రం సూర్యవంశీ బ్యాటింగ్ చేశాడు. దీని వల్ల ఆ టోర్నీలో శాంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. విదేశీ పిచ్‌లు, పరిస్థితులకు అలవాటుపడేందుకు ఇలాంటి టూర్లు సూర్యవంశీకి ఉపయోగపడుతాయని అయ్యర్ అన్నారు. అతను మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు, ఆ పరిస్థితుల్లో ఎలా ఇలాంటి పిచ్‌లపై ఆడాలో అతనికి అనుభవం వస్తుందన్నాడు.
స్వదేశంలో ఫ్లాట్ పిచ్‌లపై ఆడిన తాము.. ఇక పేస్ ఫ్రెండ్లీ పిచ్‌లపై ఆడేందుకు సిద్దం కావాలన్నారు. కివీస్‌లో ఉన్న కోల్డ్ వెదర్ కూడా తట్టుకోవాలన్నారు. ఇక్కడ పరిస్థితులను గమనిస్తే, వెదర్ ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తుందన్నాడు. న్యూజిలాండ్‌కు హోం అడ్వాంటేజ్ ఉంటుందన్నాడు. ఇషాన్ కిషన్ మూడవ నెంబర్లో బ్యాటింగ్ చేస్తున్నాడని, తానేమీ ఆర్డర్లో ముందు వెళ్లాలనుకోవడం లేదన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

