The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
The Prompt War | భారతీయ పురాణాలు, అంతుచిక్కని రహస్యాలు, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ కలయికతో సరికొత్త సినిమాటిక్ ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు ‘ఆర్విహా క్రియేషన్స్’ సిద్ధమవుతోంది.
భారతీయ పురాణాలు, అంతుచిక్కని రహస్యాలు, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ కలయికతో సరికొత్త సినిమాటిక్ ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు ‘ఆర్విహా క్రియేషన్స్’ సిద్ధమవుతోంది. ఈ సంస్థ తన తొలి చిత్రంగా నరేష్ గౌడ్ నిర్మాణంలో, నూతన దర్శకుడు ప్రసన్న కొత్వాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’ టైటిల్ను దసరా పండుగ సందర్భంగా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత కథా ప్రపంచంతో ఈ సినిమా రూపొందుతుండటం టాలీవుడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
‘రైజ్ ఆఫ్ మహావీర్’ అనే ఉపశీర్షిక కథలోని కీలక పాత్ర, దాని వెనుక దాగి ఉన్న రహస్యాలపై ఉత్కంఠను పెంచుతుండగా, జి.సి. శేఖర్ ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పురాణాలలోని అంశాలను ఆధునిక సాంకేతికతతో మేళవిస్తూ, ప్రేక్షకులకు విజువల్ వండర్ అందించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో 3డీ వెర్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఒకే రక్తంలో రెండు ధర్మాలు, ఒకే యుద్ధంలో రెండు యుగాలు.. 🏹
ఈ యుద్ధంలో తొలి ఆయుధం ఒక అక్షరం.. ✍🏼– అందరికి దసరా శుభాకాంక్షలు –
#ThePromptWar #RiseOfMahaveer #AarvihaCreations https://t.co/di3jCLepto
— AarvihaCreations (@TheAarviha) October 20, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
రకుల్ ప్రీత్ అందాల విందు.. బ్లూ శారీలో స్టన్నింగ్ లుక్తో కట్టిపడేస్తోందిగా!
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

