తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీదుంది రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఈ భామ అల్లు అర్జున్ తో పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప సినిమా చేస్తుంది. మరోవైపు హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఎక్కడుంది..ఏం చేస్తుందో తెలుసా..? ప్రస్తుతం రష్మిక హిందీలో సిద్దార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra)తో కలిసి స్పై థ్రిల్లర్ మిషన్ మజ్ను (Mission Majnu). చేస్తోంది.
ఈ సినిమా సుమారు 45 రోజుల కీలక షెడ్యూల్ ను లక్నోలో పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ ను నెల క్రితమే పూర్తి చేశారు మేకర్స్. లక్నో షూటింగ్ పూర్తయిన తర్వాత రష్మిక ముంబైకి వచ్చేసిందట. బీటౌన్ టాక్ ప్రకారం తన రెండో బాలీవుడ్ సినిమా గుడ్ బై కోసం ముంబైలో కొంతకాలం ఉంది రష్మిక. ఇక అక్కడి నుంచి తెలుగులో నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కోసం హైదరాబాద్ కు చేరుకుంది. అనంతరం మళ్లీ మిషన్ మిజ్ను షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి పయనమైందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. మొత్తానికి రష్మికమందన్నా ఇలా ప్రధాన నగరాలను చుట్టేస్తూ బిజీబిజీగా ఉందన్నమాట.
మిషన్ మజ్నుకు సంబంధించిన మేజర్ షెడ్యూల్ ను ముంబైలో సిద్దార్థ్ మల్హోత్రా, రష్మిక అండ్ టీం కలిసి పూర్తి చేయనుంది. ఈ షెడ్యూల్ తో రష్మిక పార్టు పూర్తవుతుందట. పాకిస్థాన్ లో ఇండియన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్స్ రా చేపట్టిన అతిపెద్ద కోవర్టు ఆపరేషన్ నేపథ్యంలో మిషన్ మజ్ను తెరకెక్కుతుంది. శాంతను బాఘ్చి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని రోన్నీ స్క్రూవాలా, అమర్ బుటాలా, గరిమా మెహతా నిర్మిస్తున్నారు.
ఇవికూడా చదవండి..
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!