వేచిచూసి.. వెనుదిరిగి..
ఏజెన్సీలో వై ద్యం అందని ద్రాక్ష గా మారింది. పీహెచ్సీల్లో వైద్యులు అం దుబాటులో ఉండక, పల్లె దవాఖానలు స మయానికి తెరుచుకోక రోగులు ఇబ్బందిపడుతున్నారు. ములుగు జిల్లా వాజేడు ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతోపాటు గ్రామాల్లో ఉన్న పల్లె దవాఖానల్లో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు. వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండడం, అరకొరగా ఉన్న వై ద్యులు సమయపాలన పాటించకపోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు కండ్లుకాయలు కాచేలా ఎదురు చేసి నిరాశతో వెనుదిరుగుతున్నారు.
- వాజేడు ఏజెన్సీలో రోగులకు అందని సర్కారు వైద్యం
- సమయపాలన పాటించని వైద్యులు
- కిందిస్థాయి సిబ్బంది, ఆశకార్యకర్తలే దిక్కు
- వారిచ్చిన మందులతో నిరాశతో వెళ్తున్న రోగులు
- ఏజెన్సీలో ఖాళీగా వైద్యుల పోస్టులు
వాజేడు, ఫిబ్రవరి 23 : ఏజెన్సీలో వై ద్యం అందని ద్రాక్ష గా మారింది. పీహెచ్సీల్లో వైద్యులు అం దుబాటులో ఉండక, పల్లె దవాఖానలు స మయానికి తెరుచుకోక రోగులు ఇబ్బందిపడుతున్నారు. ములుగు జిల్లా వాజేడు ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతోపాటు గ్రామాల్లో ఉన్న పల్లె దవాఖానల్లో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు. వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండడం, అరకొరగా ఉన్న వై ద్యులు సమయపాలన పాటించకపోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు కండ్లుకాయలు కాచేలా ఎదురు చేసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. వాజే డు మండలకేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో సోమవారం ఉదయం 11 గంటలు దాటినా వైద్యులు విధులకు హాజరుకాకపోవడంతో రోగులు చాలా సమయం వేచిచూసి చివరికి వైద్యసిబ్బంది ఇచ్చిన మందు లు తీసుకొని వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నది.
ప్రగళ్లపల్లి గ్రామంలోని పల్లె దవాఖాన మధ్యాహ్నం 12 గంటలు దాటినా తెరుచుకోలేదు. ఇక్కడ పనిచేస్తున్న వైద్యురాలు స్థానికంగా ఉండకపోవడం.., వైద్యులు సమయపాల న పాటించకపోవడంతో రోగులకు ఆశ కార్యకర్తలే దిక్కుగా మారారు. వారు ఇచ్చిన మందులనే తీసుకెళ్లారు. పెద్దగొల్లగూడెం, చెరుకురు తదితర పల్లె దవాఖానలోల సైతం వైద్యులు అందుబాటులో ఉండడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. వాజేడు పీహెచ్సీలో మూడు వైద్యపోస్టులకుగాను ఇద్దరు ఉండగా, వారు ఉన్నత వైద్యవిద్య కోసం వెళ్లారు. దీంతో ఇక్కడ ఎంసీహెచ్, పల్లె దవాఖానల్లో పనిచేసే వైద్యులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించగా, వారు కూడా సమయానికి రావడం లేదని స్థానికులు చెబుతున్నా రు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఏజెన్సీలోని పీహెచ్సీలతోపాటు పల్లె దవాఖానల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు భర్తీచేసి సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

