సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jun 08, 2020 , 15:15:09

శ్రీమతికి రొమాంటిక్ బర్త్‌డే విషెస్ అందించిన రాజ్‌కుంద్రా

శ్రీమతికి రొమాంటిక్ బర్త్‌డే విషెస్ అందించిన రాజ్‌కుంద్రా

అందం, అభినయంతో కోట్లాది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సాగర కన్య శిల్పా శెట్టి. తెలుగు, హిందీతో పాటు పలు భాషలలో నటించిన శిల్పా శెట్టి సాహసవీరుడు సాగరకన్య, ఆజాద్, భలేవాడివి బాసు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ప్రముఖ వ్యాపార వేత్త రాజ్‌కుంద్రాని వివాహం చేసుకున్న తర్వాత శిల్పా శెట్టి కొంత కాలం సినిమాలకి దూరంగా ఉంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత నికమ్మ, హంగామా 2 చిత్రాలతో తిరిగి  ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమైంది. 

శిల్పా శెట్టి నేడు 44వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయన భర్త రాజ్‌కుంద్రా ఓ వీడియో ద్వారా రొమాంటిక్‌ బర్త్‌డే విషెస్ అందించాడు. వైవాహిక జీవితంకి సంబంధించిన మధుర స్మృతులని ఓ వీడియోగా రూపొందించి తన శ్రీమతికి లవ్‌లీ విషెస్ అందించాడు. ఒక్కో ఫోటోకి ప్రత్యేకమైన కొటేషన్స్‌ రాసి తన ప్రేమని తెలియజేశాడు. నీ  ప్రేమతో, నా లోపాలను పరిపూర్ణతలుగా మార్చిన మహిళ మీరు. మీరు చిరునవ్వు నా జీవితంలో చీకటి రోజులను వెలిగిస్తుంది . మీరు నా పిల్లల తల్లి మాత్రమే కాదు, నా జీవితానికి, హృదయానికి రాణి. ఐ లవ్ యు జాన్ . పుట్టినరోజు శుభాకాంక్షలు శిల్పాశెట్టి  అని రాసుకొచ్చారు రాజ్‌.

కరోనా వలన ప్రస్తుతం ఇంటికే పరిమితమైన శిల్పా శెట్టి టిక్‌ టాక్ వీడియోస్‌తో నెటిజన్స్‌కి కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. రీసెంట్‌గా దక్షిణాది పాటలకి ఆమె చేసిన టిక్‌ టాక్ వీడియో ఫుల్‌ వైరల్ అయింది. నవంబర్ 22,2009న రాజ్‌ కుంద్రా,శిల్పాశెట్టిల వివాహం జరగగా, వీరికి ఎనిమిదేళ్ళ కొడుకు వియాన్‌, మూడు నెలల కూతురు సమిషా ఉన్నారు. సమిషా సరోగసీ ద్వారా జన్మించిన విషయం తెలిసిందే. logo