పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) లవ్ లీ బ్యూటీ పూజాహెగ్డే కాంబోలో వస్తోన్న చిత్రం రాధేశ్యామ్ ( Radhe shyam ) . రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా..అని ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు. రాధేశ్యామ్ చిత్రాన్ని మకర సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న విడుదల చేయబోతున్నారు.
విడుదల తేదీ అప్ డేట్ ను ఇస్తూ యూవీ క్రియేషన్స్ ఓ పోస్టర్ విడుదల చేసింది. ప్రభాస్ ఆఫీస్ షూట్లో చేతిలో బ్రీఫ్ కేస్ పట్టుకుని స్టైలిష్ గా నడిచి వస్తున్న స్టిల్ చూసిన ఫ్యాన్స్ ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు. రాధేశ్యామ్ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో షూట్ చేశారు. రాధేశ్యామ్‌ను యూవీ క్రియేషన్స్ అండ్ టీ సిరీస్ బ్యానర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
ప్రభాస్ మరోవైపు నాగ్ అశ్విన్ తో ప్రాజెక్టు కే, ప్రశాంత్ నీల్ తో సలార్, ఓం రావత్ తో ఆదిపురుష్ సినిమాలతో బిజీ కానున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను ఎంటర్ టైన్ చేయడంపైనే ఫోకస్ పెట్టాడు డార్లింగ్ స్టార్.
Directed by @director_radhaa
— UV Creations (@UV_Creations) July 30, 2021
Presented by @UVKrishnamRaju garu
Produced by @UV_Creations @TSeries #BhushanKumar with #Vamshi #Pramod & @PraseedhaU under @AAFilmsIndia @GopiKrishnaMvs
Music by – @justin_tunes @Mithoon11 #MananBharadwaj pic.twitter.com/3t6omKkefu
ఇవి కూడా చదవండి..
రూ.25 లక్షలు గెలుచుకున్న రాంచరణ్
‘రామారావు’తో వేణు గ్రాండ్ కమ్‌బ్యాక్
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..