ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) చెన్నైలోని కోవలమ్ నివాసంలో కింద పడటంతో ఎడమ భుజానికి గాయాలైన విషయం తెలిసిందే. దీంతో వెంటనే ప్రకాశ్ రాజ్ సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి ప్రాథమిక చికిత్స తీసుకున్నాడు. అటు నుంచి సర్జరీ (surgery) కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రకాశ్ రాజ్ ఎడమ భుజానికి ఆయన స్నేహితుడు, ప్రముఖ ఆర్దోపెడిక్, జాయింట్ రీప్లేస్ మెంట్ నిపుణుడు డాక్టర్ గురువారెడ్డి (Dr. Gurava Reddy) సర్జరీ చేశారు. ఆపరేషన్ విజయవంతమైన తర్వాత ఆస్పత్రి బెడ్ పై సెల్ఫీ దిగి ట్విటర్ లో పోస్ట్ చేశాడు ప్రకాశ్ రాజ్.
డెవిల్ ఈజ్ బ్యాక్. సర్జరీ విజయవంతమైంది. ప్రియమైన స్నేహితుడు డాక్టర్ గురువారెడ్డికి ధన్యావాదాలు. నా క్షేమం కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు. త్వరలోనే యాక్షన్ లోకి దిగుతానంటూ ట్వీట్ పెట్టాడు. ప్రకాశ్ రాజ్ హాస్పిటల్ బెడ్ సెల్ఫీ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. గాయం కావడంతో హైదరాబాద్ వెళ్లి సర్జరీ చేసుకోవాలని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు ప్రకాశ్ రాజ్.
ఘటనకు ముందు ధనుష్ 44వ సినిమా షూటింగ్ కోసం చెన్నైలో ఉన్నాడు ప్రకాశ్ రాజ్. మరోవైపు మణిరత్నం భారీ మల్టీ స్టారర్ పొన్నియన్ సెల్వన్ కీలక షెడ్యూల్ ను పాండిచ్చేరిలో పూర్తి చేశాడు.
ఇటీవలే విడుదలైన నెట్ ఫ్లిక్స్ అంథాలజీ నవరసలో మెరిశాడు ప్రకాశ్ రాజ్.
The 👿 devil is back… successful surgery.. thank you dear friend Dr #guruvareddy and 🤗🤗🤗 thank you all for your love n prayers.. back in action soon 💪😊 pic.twitter.com/j2eBfemQPn
— Prakash Raj (@prakashraaj) August 11, 2021
ఇవి కూడా చదవండి..
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Mahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!