చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా షూటింగ్లో పాల్గొనడంతో ఆనందంలో ఉన్నారు అభిమానులు. మరోవైపు నిర్మాతలు కూడా సంతోషంలో మునిగిపోయారు. వకీల్ సాబ్ తర్వాత ఆయన మళ్లీ ఏ సినిమా లొకేషన్‌కు రాలేదు. మధ్యలో కరోనా రావడం.. కొన్ని రోజులు తిరుపతి ఎలక్షన్స్.. మరికొన్ని రోజులు అమరావతి పర్యటన అంటూ మూడు నాలుగు నెలలు ఇట్టే గడిచిపోయాయి. చాలా రోజుల తర్వాత ఆయన మళ్లీ కెమెరా ముందుకు వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా సంక్రాంతి 2022 విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇది తెలిసిన తర్వాత పండగ చేసుకుంటున్నారు పవన్ అభిమానులు. కానీ ఇక్కడే అందరికీ మరో చిన్న అనుమానం వస్తుంది.
నిజానికి సంక్రాంతికి రావాల్సింది పవన్, రానా సినిమా కాదు. క్రిష్ హరిహర వీరమల్లు సినిమా. దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో సీనియర్ నిర్మాత ఏ.ఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ 40 శాతానికిపైగా పూర్తయింది. ఆరునూరైనా ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల చేస్తాం అంటూ అప్పట్లో అధికారికంగా ప్రకటించాడు రత్నం. కరోనా సెకండ్ వేవ్ మొదలైన తర్వాత కూడా తమ సినిమా సంక్రాంతికి వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సినిమాను పక్కన పెట్టి త్రివిక్రమ్ సినిమాను ముందుకు తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నటిస్తున్న అయ్యప్పునుమ్ కోశీయుమ్ రీమేక్ సంక్రాంతికి విడుదల కానుంది.
తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే విడుదలైన పవన్ స్టిల్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. పరశురామ కృష్ణమూర్తి అనే టైటిల్‌ను ఈ సినిమా కోసం ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. కేవలం పవన్ కళ్యాణ్ తో స్నేహం కారణంగానే ఒక మెట్టు దిగి ఈ సినిమా కోసం పని చేస్తున్నాడు మాటల మాంత్రికుడు.
ఉన్నఫలంగా క్రిష్ సినిమాను పక్కన పెట్టడానికి కారణాలు ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు. దానికి ప్రత్యేకంగా కారణాలు అవసరం లేదు. భారీ విజువల్ ఎఫెక్ట్స్ కు తోడు యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. దీని కోసం పవన్ మరింత సమయం కేటాయించాల్సి ఉంది. అందుకే ముందుగా సాగర్ సినిమా పూర్తి చేసి ఆ తర్వాత క్రిష్ సినిమా వైపు అడుగులు వేస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్-రానా రీమేక్ ప్రాజెక్టు మేకింగ్ వీడియో
RRR ప్రమోషన్స్ | ఐదు భాషల్లో దోస్తీ సాంగ్.. ఒక్కో భాషలో ఒక్కో సింగర్
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
బుచ్చిబాబు మళ్లీ ఆ హీరోనే కావాలంటున్నాడా..?