బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh khan) టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం జవాన్ (jawan). షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో నయనతార (Nayanthara) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు అట్లీ (Atlee) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ తాజా అప్డేట్ ఏంటంటే జవాన్‌లో షారుక్ ఖాన్ డ్యుయల్ రోల్లో కనిపించబోతున్నాడట.
ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభియనం చేయబోతున్నాడని జోరుగా టాక్ నడుస్తోంది. ఇక జవాన్‌లో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone ) కూడా కనిపించబోతుందని తెలుస్తోండగా..ఈ బ్యూటీ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఉంటుందట. సినిమాలో ఈ ఎపిసోడ్ చాలా కీలకంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు నయనతార యంగ్ షారుక్‌కు జోడీగా కనిపించనుందట. నెక్ట్స్ షెడ్యూల్లో షారుక్-దీపికాపై వచ్చే సన్నివేశాలను షూట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు బీటౌన్ సర్కిల్ బోగట్టా.
ఒకరు బాలీవుడ్లో లీడింగ్ హీరోయిన్..మరొకరు సౌత్‌లో లీడింగ్ హీరోయిన్..ఈ ఇద్దరి కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై ఎలా ఉండబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. చిత్రీకరణ పూర్తిచేసుకుని వీలైనంత తొందరగా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు జవాన్.