తెలుగు సినీ పరిశ్రమ స్థాయి క్రమక్రమేపి పెరుగుతూ పోతుంది. మన హీరోలు చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తూ తెలుగు ప్రేక్షకులనే కాక ఇతర భాషలకు సంబంధించిన ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు. ఇక తెలుగులో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన నాని కూడా హిందీ ప్రేక్షకులని అలరించాలని అనుకుంటున్నాడు. మంచి కథ దొరికితే తప్ప చేస్తానని అంటున్నాడు, కాని కొన్ని కండీషన్స్ చెబుతున్నారు.
నాకు హిందీ కొంత వచ్చు, కాని సినిమా చేసేంత అయితే రాదు. నేను సినిమా చేస్తే కొత్త వ్యక్తి అనే అభిప్రాయం వాళ్లలో కలగొద్దు. హిందీ మేకర్స్ ఎవరైన కథ తీసుకొచ్చి నన్ను ఇంప్రెస్ చేస్తే బాలీవుడ్ మూవీ తప్పక చేస్తా. అయితే ఆ కథ ఎలా ఉండాలి అంటే సినిమా కోసం హిందీ నేర్చుకోవాలనే తపన నాలో పుట్టించేలా ఉండాలి. టైం వచ్చినప్పుడు బాలీవుడ్ చిత్రం కూడా చేస్తాను అంటున్నాడు నాని. ఈయన నటించిన జెర్సీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి’ సినిమాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
బాలకృష్ణ-మీనా..క్లాసిక్ కపుల్ ఈజ్ బ్యాక్..!
రామ్ మిర్యాల రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది..వీడియో
చైతూ-రాశీఖన్నా సెల్ఫీ షాట్ అదిరింది
ఆర్య@17.. బన్నీ ఎమోషనల్ ట్వీట్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
అనసూయ థ్యాంక్ యు బ్రదర్ ఎలా ఉంది…?
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్