Naga Chaitanya | అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ఇప్పటికే విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ‘దూత’ వెబ్ సిరీస్ చేశాడని తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్‌ను 54వ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శించారు. కాగా ఇప్పుడు చైతూ మరో వెబ్ సిరీస్‌కు సంతకం చేశాడన్న వార్తలు నెట్టింట షికారు చేస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై పీఆర్వోస్ టీం క్లారిటీ ఇచ్చేసింది. చైతూ కొత్త వెబ్‌సిరీస్‌కు సంతకం చేశాడని వస్తున్న పుకార్లు పూర్తిగా అవాస్తవం. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాం. నాగచైతన్య ప్రస్తుతం తన ఫోకస్ అంతా తండేల్ సినిమాపైనే పెట్టాడని ఓ ప్రకటన విడుదల చేసింది.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న తండేల్‌ను చందూమొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు తెరకెక్కిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే తండేల్ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌లో చైతూ మత్య్సకారుడిగా మాస్ లుక్‌లో కనిపిస్తుండగా.. సాయిపల్లవి శ్రీకాకుళం అమ్మాయి సత్య పాత్రలో కనిపించనుంది.
The news circulating about Yuvasamrat @chay_akkineni signing a new web series is completely false.
We kindly request that media outlets refrain from spreading this misinformation. He is currently focused entirely on #Thandel pic.twitter.com/AGuLB6J7ni
— BA Raju’s Team (@baraju_SuperHit) October 14, 2024
They Call Him OG | అందమైన లొకేషన్లో ఓజీ షూటింగ్.. ఇంతకీ పవన్ కల్యాణ్ టీం ఎక్కడుందో..?
Ka | కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్.. క విడుదలయ్యేది అప్పుడే
Kanguva | సూర్య కంగువ తెలుగు, తమిళం ఆడియో లాంచ్.. ముఖ్య అతిథులు వీళ్లే..!