Naga Chaitanya | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ తండేల్ (Thandel). చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న తండేల్‌లో సాయిపల్లవి (Sai Pallavi) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ముందుగా ఈ మూవీని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించగా.. ఆ తర్వాత విడుదల వాయిదా పడుతుందంటూ తెరపైకి వార్తలు వస్తూనే ఉన్నాయి.
విడుదల తేదీపై నెలకొన్న డైలామాపై నాగచైతన్య క్లారిటీ ఇచ్చాడు. క ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగచైతన్య మాట్లాడుతూ.. గీతాఆర్ట్స్ ఉత్తమమైన కంటెంట్‌తో ఉత్తమంగా విడుదల చేస్తుంది. కాబట్టి గీతా ఆర్ట్స్‌తో పనిచేసే ఏ యాక్టర్‌కైనా అపారమైన ధైర్యం ఉంటుంది. అందరికీ ఆమోదయోగ్యమైన విడుదల తేదీని అల్లు అరవింద్ ఫిక్స్ చేస్తారు. దీనిపై మేము త్వరలోనే అధికారిక ప్రకటన జారీ చేస్తామన్నాడు.
మరోవైపు చందూమొండేటి మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ విడుదలవుతుందని తెలిసినప్పటి నుంచి అరవింద్ రిలీజ్‌కు నో చెప్తుంటే.. వెంకటేశ్ సినిమా విడుదలవుతుంటే నాగచైతన్య నో చెప్తున్నారు. తండేల్ జనవరి కల్లా రెడీ అవుతుంది. విడుదల తేదీని ముందుకు జరిపే అవకాశాలున్నాయని అన్నాడు చైతూ. ఈ లెక్కన తండేల్ టీం నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం రిపబ్లిక్ డే, వాలెంటైన్స్ డేలో ఏదో టైం ఫిక్స్ చేస్తారనిపిస్తుంది.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోంది తండేల్. గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Rashmika Mandanna | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా.. వివరాలివే
Singham Again | అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ నయా రికార్డ్.. ఏంటో తెలుసా..?