Padma Devender Reddy | మెదక్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): యాసంగిలో రైతులు సాగు చేస్తున్న పంటలను కాపాడేందుకు సింగూరు ప్రాజెక్టు నుంచి వెంటనే 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి రైతులతో కలిసి ఫిర్యాదు చేశారు. మంగళవారం హైదరాబాద్లోని మానవ హక్కుల కమిషన్ కార్యాలయం వెళ్లి కమిషన్కు ఫిర్యాదు చేశారు.
ఘణపూర్ ఆయకట్ట కింద రైతులు వేల ఎకరాలలో పంటలు సాగు చేస్తున్నారని, సింగూరు నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు సాగు చేస్తున్న పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. రెండు మూడు రోజుల్లో నీటిని విడుదల చేయకపోతే చివరి దశలో ఉన్న పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకొని సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
సింగూరు నీటిని విడుదల చేయకపోతే రైతులు సాగు చేస్తున్న పంటలు ఎండిపోయి పెట్టిన పెట్టుబడులు రాని పరిస్థితి ఉందన్నారు. రెండు రోజుల్లో నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Reservoirs | తెలంగాణలో తీవ్ర నీటి సంక్షోభం.. డెడ్ స్టోరేజ్ దిశగా తెలంగాణ జలాశయాలు
Anant Ambani | ఆధ్యాత్మిక సేవలో అంబానీ వారసుడు.. గురువాయూర్, రాజరాజేశ్వరం ఆలయాలకు రూ.18 కోట్ల సాయం!
New Shayampet | కాలుష్య కోరల్లో చెరవులు..పట్టించుకోని అధికారులు