Anant Ambani | ఆధ్యాత్మిక సేవలో అంబానీ వారసుడు.. గురువాయూర్, రాజరాజేశ్వరం ఆలయాలకు రూ.18 కోట్ల సాయం!
AnantAmbani | రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ కేరళలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి, ఏనుగుల సంక్షేమానికి భారీ విరాళం ప్రకటించారు.
AnantAmbani | రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ కేరళలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి, ఏనుగుల సంక్షేమానికి భారీ విరాళం ప్రకటించారు. పవిత్రమైన గురువాయూర్ మరియు రాజరాజేశ్వరం దేవాలయాలను సందర్శించిన ఆయన, మొత్తం 18 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా రెండు దేవాలయాలకు చెరో 3 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 6 కోట్ల రూపాయలను తక్షణ విరాళంగా అందజేశారు. అలాగే చారిత్రక ప్రాధాన్యత కలిగిన రాజరాజేశ్వరం ఆలయ తూర్పు గోపుర పునరుద్ధరణ పనుల కోసం మరో 12 కోట్ల రూపాయలను కేటాయించాడు. దాదాపు రెండు శతాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న ఈ పురాతన గోపురాన్ని పునరుద్ధరించడం భక్తులకు మరియు ఆలయ అధికారులకు ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది.
ఆలయ సందర్శనలో భాగంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ.. భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కావని, అవి మన విశ్వాసాన్ని, సామాజిక స్పృహను, ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని ప్రతిబింబించే సజీవ సంస్థలని పేర్కొన్నాడు. మన పవిత్ర వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూనే, మన సంప్రదాయాల్లో అంతర్భాగమైన జంతువులకు గౌరవప్రదమైన మరియు శాస్త్రీయమైన సంరక్షణ అందించడమే తన లక్ష్యమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్లు, ప్రధాన అర్చకులు మరియు బోర్డు సభ్యులు పాల్గొని అనంత్ అంబానీని సంప్రదాయబద్ధంగా గౌరవించి ప్రసాదాలను అందజేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

