Reservoirs | ప్రభుత్వం ముందు చూపుకొరవడంతో తెలంగాణలోని జాలాశయాలు డెడ్ స్టోరేజ్‌గా మారుతుననాయి. యాసంగి సీజన్ చివరి దశలో ఉన్నందున రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు సకాలంలో పడకపోతే తాగు, సాగు నీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నీరు తరలించుకుపోతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టులో 215.81 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం కేవలం 43.75 టీఎంసీలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 312.05 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 176.06 టీఎంసీలు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 80.50 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 28.85 టీఎంసీలు, నిజాంసాగర్‌లో 17.80 టీఎంసీల సామర్థ్యానికి 9.54 టీఎంసీలు, సింగూర్‌లో 29.91 టీఎంసీల సామర్థ్యానికి 7.46 టీఎంసీలు, జూరాల ప్రాజెక్టులో 9.66 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 4.71 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండడం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు. ఇదే తరహాలో కొనసాగితే రాష్ట్రంలో సాగు, తాగు నీటికి తీవ్ర సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.