Natasa Stankovic | మాజీ భర్త కుటుంబంతో సరదాగా.. నటాషా ఫొటోలు వైరల్..!
Natasa Stankovic : మోడల్, సినిమా నటి నటాషా స్టాంకోవిక్ (Natasa Stankovic) మరోసారి వార్తల్లో నిలిచింది. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) నుంచి విడాకులు తీసుకున్న నటాషా రెండేళ్ల తర్వాత అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అతడి కుటుంబాన్ని కలిసింది.
Natasa Stankovic : మోడల్, సినిమా నటి నటాషా స్టాంకోవిక్ (Natasa Stankovic) మరోసారి వార్తల్లో నిలిచింది. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) నుంచి విడాకులు తీసుకున్న నటాషా రెండేళ్ల తర్వాత అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అతడి కుటుంబాన్ని కలిసింది. హార్దిక్ తల్లి, సోదరి, అన్నయ్య కృనాల్ పాండ్యా, నానమ్మలతో సరదాగా గడిపింది. కుమారుడు అగస్త్యతో కలిసి వడోదరకు వెళ్లిన నటాషా.. తన మాజీ భర్త కుటుంబంతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇటీవలే హార్దిక్ నుంచి ఖరీదైన ఎస్యూవీ కారును బహుమతిగా అందుకున్న నటాషా ఇప్పుడు అతడి ఫ్యామిలీకి దగ్గరవ్వడం చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యాతో నాలుగేళ్ల వివాహ బంధాన్ని తెంచుకున్న నటాషా స్టాంకోవిక్ కొన్ని రోజులు స్నేహితుడితో కలిసి తిరిగింది. పాండ్యాతో విడిపోయాక తన ఇన్‌స్టాలో టాక్సిక్ రిలేషన్షిప్ పోస్ట్‌లతో వైరలైన నటాషా.. వడోదరలో ప్రత్యక్షమవ్వడంతో అసలేం జరగుతోంది? అనేది తెలియడం లేదు. కుమారుడు అగస్త్యతో పాటు అక్కడ ఆమె తన మాజీ భర్త పాండ్యా కుటుంబాన్ని కలిసింది. ‘బరోడా ఎలా ఉన్నావు?’ అనే క్యాప్షన్‌తో ఆమె సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేసింది.
Natasa Stankovic with Hardik Pandya’s mother, grandmother, Son
The way Hardik Pandya’s family cares for Natasa Stankovic. ❤️ pic.twitter.com/f5nejuwRpZ
— Instinct (@Clutchxgod33) April 6, 2026
ఆ ఫొటోల్లో అగస్త్య, నటాషా చాలా సంతోషంగా కనిపించారు. దాంతో.. పాండ్యా, నటాషా గురించి వదంతులను వ్యాప్తి చేయాల్సిన అవసరం లేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. విడాకుల ప్రకటనలోనే అగస్త్యకు తల్లిదండ్రులుగా తాము ఎల్లవేళలా అండగా ఉంటామని, తమ బాధ్యతలను నిర్వర్తిస్తామని పాండ్యా స్పష్టం చేసినందున నటాషా వడోదరకు వెళ్లి ఉండవచ్చని మరొకొందరు అంటున్నారు.
విడాకుల పోస్ట్‌తో
రెండేళ్ల క్రితం బార్బడోస్ నుంచి టీ20 ప్రపంచకప్ హీరోగా స్వదేశం వచ్చిన హార్దిక్ పాండ్యా విడాకుల పోస్ట్‌తో అందర్నీ షాక్‌కు గురి చేశాడు. అప్పటి నుంచి ఇద్దరు ఎవరి జీవితం వారిదే అన్నట్టుగా ఉంటున్నారు. రెండోసారి ప్రేమలో పడిన పాండ్యా.. ఇన్‌ప్లూయెన్సర్ మహీకా శర్మతో చెట్టాపట్టాలేసుకొని కనిపిస్తున్నాడు. అదే సమయంలో అతడు తన మాజీ భార్య, కుమారుడు అగస్త్యను మర్చిపోలేదు. వారి సౌకర్యార్థం రూ.4 కోట్ల ఎస్యూవీ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కానుకగా ఇచ్చాడీ ఆల్‌రౌండర్.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

