టాలీవుడ్ (Tollywood)లో అత్యధికంగా ఆర్జిస్తున్న యాక్టర్లలో టాప్ ప్లేస్ లో ఉంటాడు స్టార్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu). ఓ వైపు సినిమాలతో ఎంటర్ టైన్ చేస్తూనే మరోవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ (Brand ambassador)గా కూడా వ్యవహరిస్తూ..రెండు చేతులా సంపాదిస్తుంటాడు. అయితే తన సంపాదనలో సామాజిక సేవకు ప్రాధాన్యత ఇస్తుంటాడని అందరికీ తెలిసిందే. తాజాగా మహేశ్ బాబు కూల్ డ్రింక్స్ ప్రాడక్ట్ Mountain Dewకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడయ్యాడు.
భయాలను పక్కన పెట్టి, సవాళ్లను అధిగమించి రిస్క్ తీసుకుంటేనే పేరు వస్తుంది అనే ట్యాగ్ లైన్‌తో వచ్చే మౌంటైయిన్ డ్యూ వాణిజ్య ప్రకటన యూత్‌కు కనెక్ట్ అయ్యేలా సాగుతుంది. ఇండియావైడ్‌గా భారీ సంఖ్యలో ఫాలోవర్లున్న మహేశ్‌బాబును తమ ప్రచార కర్తగా నియమించుకొని కస్టమర్లకు మరింత చేరవయ్యేలా ప్లాన్ చేసింది మౌంటెయిన్ డ్యూ. ఇక టీవీ కమర్షియల్ యాడ్స్ తోపాటు డిజిటల్ ప్లాట్‌ఫాంలలో కూడా కనిపించబోతున్నాడు మహేశ్‌బాబు.
మౌంటెయిన్ డ్యూ బ్రాండ్‌ను మరింత విస్తరించాలనుకుంటున్నాం. మా కస్టమర్ల సంఖ్యను మరింతగా పెంచుకోవడంలో మహేష్ బాబు కీలక పాత్ర పోషిస్తారు. ఇది మాకు పెద్ద మైల్ స్టోన్. మహేశ్‌బాబు చాలా ధైర్యంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటూ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతాడని పెప్పికో ఇండియా డైరెక్టర్ వినీత్ వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.
మౌంటైన్ డ్యూ నాతో ఎల్లప్పుడూ బలంగా ప్రతిధ్వనించింది. ఎందుకంటే ఇది నా నమ్మకానికి అనుగుణంగా ఉంది. నేను వాణిజ్య ప్రకటనలు చూస్తున్నా..ఆ ప్రకటనలు నా ఇమేజ్‌కి సరిపోతాయి.
నా ఇమేజ్‌కు అనుకూలంగా ఉండటమనేది నా బ్రాండ్ అసోసియేషన్లను నిర్ణయించే ముఖ్యమైన విషయం..అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు మహేశ్ బాబు.
ఇవి కూడా చదవండి..
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్..నిజమెంత..?
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?