Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్‌పై మాట్లాడే హక్కు మీకు లేదు.. ఓఐసీ దేశాలకు ఇండియా వార్నింగ్
Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్ అంశంపై మాట్లాడే హక్కు ఓఐసీ దేశాలకు లేదని ఇండియా తెలిపింది. ఈ అంశంపై స్పందించిన ఐఓసీ తీరును ఇండియా తప్పుబట్టింది. ఈ మేరకు బుధవారం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన చేసింది.
Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్ అంశంపై మాట్లాడే హక్కు ఓఐసీ దేశాలకు లేదని ఇండియా తెలిపింది. ఈ అంశంపై స్పందించిన ఐఓసీ తీరును ఇండియా తప్పుబట్టింది. ఈ మేరకు బుధవారం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన చేసింది. కుదిరితే తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలని సూచించింది. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం అమెరికాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో ఓఐసీ తరఫున టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మాట్లాడాడు.
దక్షిణాసియాలోని అనేక సమస్యల్ని, వివాదాల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. అయితే, సంబంధం లేకుండా జమ్మూ కాశ్మీర్ అంశం గురించి మాట్లాడటాన్ని ఇండియా తప్పుబట్టింది. జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడే హక్కు ఓఐసీ కాంటాక్ట్ గ్రూప్‌నకు లేదన్నారు. అంతేకాదు.. జమ్మూ కాశ్మీర్, లదాక్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమని, వీటి విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యాన్ని సహించబోమని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.
Statement on references to India in the Joint Communiqué of the OIC Contact Group on Jammu & Kashmir ⬇️
🔗 https://t.co/nEvJS3P3ZS pic.twitter.com/AGfN5A6YYh
— Randhir Jaiswal (@MEAIndia) September 23, 2026
పాకిస్తాన్ చేస్తున్న ఈ ఉద్దేశపూర్వక, తప్పుడు ప్రచారాన్ని నమ్మే బదులు.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు బుద్ది చెప్పాలని కేంద్రం సూచించింది. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది అనేందుకు ఆధారాలున్నాయన్నారు. అనవసర విషయాలపై ఓఐసీ స్పందించి ఆ గ్రూపునకు ఉన్న విశ్వసనీయతను పోగొట్టుకోవద్దని హితవు పలికింది. ఓఐసీ అంటే.. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్. ఇందులో పాకిస్తాన్‌తోపాటు టర్కీ, సౌదీ అరేబియా, అజార్ బైజాన్, నైగర్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

