Lokesh Kanagaraj | ఒకేసారి దళపతి 67, ఖైదీ 2 అప్డేట్స్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్
మల్టీస్టారర్ విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ గ్రాండ్ కమ్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చేలా చేశాడు లోకేశ్ కనగరాజ్. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ స్టార్ హీరో విజయ్ తో చేయబోయే దళపతి 67(Thalapathy 67) గురించి అప్డేట్ ఇచ్చేశాడు.
ఖైదీ, విక్రమ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). మల్టీస్టారర్‌గా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన విక్రమ్ తమిళంతోపాటు విడుదలైన అన్ని భాషల్లో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడమే కాదు.. ఈ సినిమాతో కమల్ హాసన్ గ్రాండ్ కమ్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చేలా చేశాడు లోకేశ్ కనగరాజ్.
ఈ టాలెంటెడ్ డైరెక్టర్ స్టార్ హీరో విజయ్ తో చేయబోయే దళపతి 67(Thalapathy 67) గురించి అప్డేట్ ఇచ్చేశాడు. ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలిపాడు. అంతేకాదు మరో అప్డేట్ కూడా చెప్పాడు. దళపతి 67 షూటింగ్ పూర్తవగానే కార్తీతో చేస్తున్న ఖైదీ 2ను మొదలుపెట్టనున్నట్టు తెలిపాడు లోకేశ్.
విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ తమిళంలో వారిసు టైటిల్‌తో తెరకెక్కుతుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న వారిసు చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. వారిసు ఫస్ట్ సింగిల్ అప్డేట్ త్వరలోనే రానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో విజయ్ నటించిన బీస్ట్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో వారసుడు సినిమాతో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.
Read Also : Mahesh Babu | మహేశ్ బాబు ఫ్యామిలీ ఇప్పుడెక్కడుందో తెలుసా..?
Read Also : Sudheer Babu | ఇన్‌ల్యాండ్ లెటర్‌తో సుధీర్ బాబు కొత్త సినిమా పోస్టర్.. వివరాలివే
Read Also : SS Rajamouli | ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్కు అవార్డు.. వీడియో
Read Also : Sardar 2 | మిషన్ కంబోడియా త్వరలో షురూ.. కార్తీ టీం సర్దార్ 2 వీడియో వైరల్
Read Also : Rajinikanth | నాకు గూస్బంప్స్ తెప్పించారు.. కాంతార సినిమాపై రజినీకాంత్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

