Saif Ali Khan | ఇండియన ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో ఒకడు బీటౌన్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan). ఈ క్రేజీ నటుడు జూనియర్ టైటిల్ రోల్ పోషిస్తున్న దేవర (Devara) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యా్ప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ సందర్భంగా సైఫ్ అలీఖాన్ చేసిన కామెంట్స్ తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి రుజువు చేస్తున్నాయి.
ఈవెంట్లో సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. ఇక్కడ చాలా సినీ పరిశ్రమలున్నాయి. దక్షిణాదిన, ఉత్తరాదిన సినిమాలు తెరకెక్కిస్తున్నారు. నిజంగా పాన్ ఇండియన్‌గా ఏదైనా సృష్టించడానికి, నటీనటులను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఓ సినిమా ఉండాలనే ఆలోచన ఇప్పుడు సరికొత్త ప్రమాణంగా మారుతోంది. నేను కొంచెం తెలుగు మాట్లాడగలిగినందుకు చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నా. ఎందుకంటే భవిష్యత్తు తెలుగు భాషదేనంటూ చెప్పుకొచ్చాడు సైఫ్ అలీఖాన్.
ప్రతి ఒక్కరూ మరిన్ని భాషలు నేర్చుకునేందుకు తమ పరిధులను విస్తృతం చేసుకోవాలి. అంతేకాదు యాక్టర్లు తమ కంఫర్ట్ జోన్ల నుండి బయటపడాలి. దేవరలో భాగం కావడం నాకు గొప్ప గౌరవం. ఇది మరింత మందికి భవిష్యత్తు ఇస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నానంటూ చెప్పుకొచ్చాడు సైఫ్ అలీఖాన్. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దేవరలో సైఫ్ అలీఖాన్ భైర రోల్లో నటిస్తుండగా.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Rana Daggubati | షారుక్ ఖాన్ పాదాలను టచ్ చేసిన రానా.. ఎందుకో తెలుసా..?
Sikandar | సికిందర్ కోసం సల్లూభాయ్‌తో యూరప్‌కు రష్మిక మందన్నా.. !
Sharwa 37 | బర్త్ డే స్పెషల్.. శర్వానంద్ 37లో సంయుక్తా మీనన్ పాత్ర ఇదే
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్లో మరో భామ.. ఏఆర్ మురుగదాస్ టీం వెల్కమ్