డ్యాన్స్, యాక్టింగ్, కామెడీ, యాక్షన్..ఇలా అన్నీ జోనర్లలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే హీరో అనగానే ఠక్కున గొర్తొచ్చే స్టార్ చిరంజీవి. ఈ మెగాస్టార్ హీరో పాటలు, డ్యాన్స్ కు ఫిదా కానివారెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి పాటల(Chiranjeevi songs)కు ఓ స్టార్ సెలబ్రిటీ పడి చచ్చిపోయేవాడట. తరచూ చిరంజీవి పాటకు డ్యాన్స్ చేసేవాడట. ఇంతకీ ఎవరా సెలబ్రిటీ అనే కదా మీడౌటు.
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli). అండర్ 19 మాజీ క్రికెటర్ ద్వారకా రవితేజ (Dwaraka Ravi Teja)సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని షేర్ చేయడంతో ఈ న్యూస్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అండర్ 15రోజుల్లో విరాట్ కోహ్లీ , ద్వారకా రవితేజ రూంమేట్స్. ఈ ఇద్దరూ ఆరేళ్ల గ్యాప్ తర్వాత కలుసుకున్నారు. ఈ సందర్భంగా కోహ్లీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ..పాత జ్ఞాపకాలను పంచుకున్నాడు రవితేజ.
‘అండర్ 15 టైంలో విరాట్, తాను తరచూ చిరంజీవి పాటలకు డ్యాన్స్ చేసేవాళ్లమని గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు ఇద్దరూ ఒకరికొకరం చిరు అని పిలుచుకునేవాళ్లమని చెప్పాడు. యూకేలో ఆరేళ్ల విరామం తర్వాత విరాట్‌ను కలిశా. నన్ను చూడగానే చిరు ఎలా ఉన్నావ్ అని విరాట్ నన్ను అడిగాడు. మేమిద్దరం రూమ్మేట్స్ గా ఉన్న సమయంలో నేను టీవీలో చిరంజీవి పాటలు చూస్తుంటే..విరాట్ ఆ పాటలకు డ్యాన్స్ చేసేవాడు.
అప్పటి నుండి ఇప్పటివరకు మేం ఒకరినొకరు మా పేర్లతో పిలుచుకోలేదు. చిరు అనేది మేము ఒకరికొకరు పెట్టుకున్న ముద్దుపేరు. మేమిద్దరం కలిసినప్పుడల్లా ఒకరినొకరు చిరు అని పిలుచుకుంటామని’ ఆనాటి మధుర క్షణాలను షేర్ చేసుకున్నాడు ద్వారకా రవితేజ. ఈ క్రేజీ న్యూస్ తెలిసిన మెగా అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.