Indian 2 | కమల్‌హాసన్ సార్ మళ్లీ మేలో కలుద్దాం.. శంకర్ క్రేజీ అప్డేట్స్
Shankar | స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) ఓ వైపు రాంచరణ్‌తో గేమ్ ఛేంజర్ (Game changer) సినిమా చేస్తూనే.. మరోవైపు కమల్ హాసన్ (Kamal Haasan)తో ఇండియన్ 2 (Indian 2) సినిమా చేస్తున్నాడు. కొన్ని రోజులుగా కమల్ హాసన్ అండ్ టీంపై వచ్చే భారీ యాక్షన్ పార్టు చిత్రీకరణ కోసం దక్షిణాఫ్రికాలో ఫుల్ బిజీగా ఉంది.
Shankar | స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఓ వైపు రాంచరణ్‌తో గేమ్ ఛేంజర్ (Game changer) సినిమా చేస్తూనే.. మరోవైపు కమల్ హాసన్ (Kamal Haasan)తో ఇండియన్ 2 (Indian 2) చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేసేలా ప్లాన్ చేశాడు శంకర్. కొన్ని రోజులుగా కమల్ హాసన్ అండ్ టీంపై వచ్చే భారీ యాక్షన్ పార్టు చిత్రీకరణ కోసం దక్షిణాఫ్రికాలో శంకర్ టీం ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయింది.
కమల్‌హాసన్ సార్ పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ పూర్తి చేసినందుకు ధన్యవాదాలు. మళ్లీ మేలో కలుద్దాం. ఇక ఇండియన్ 2 నుంచి గేమ్ ఛేంజర్ (Game changer) క్లైమాక్స్ షూటింగ్‌కు వెళ్తున్నాం.. అంటూ ట్వీట్ చేశాడు శంకర్. కమల్ హాసన్‌కు షేక్‌హ్యాండ్ ఇస్తున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఒకేసారి రెండు సినిమాల అప్డేట్స్ ఇచ్చి సినీ జనాల్లో జోష్ నింపుతున్నాడు శంకర్.
ఇండియన్ 2లో కాజల్ అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా..సిద్దార్థ్, బాబీ సింహా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇండియన్ 2ను లైకా ప్రొడక్షన్స్-రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లపై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్‌లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రాజోలు భామ అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
Thank you for this power-packed Schedule @ikamalhaasan sir 🔥 See you again in May! Will be moving from #Indian2Gamechanger for the climax!!! pic.twitter.com/J7WGmzCuxb
— Shankar Shanmugham (@shankarshanmugh) April 18, 2023
Read Also :
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

