Jawan | జవాన్ కోసం షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే రిహార్సల్స్
Jawan | బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ ‘జవాన్’ (jawan). దీపికా పదుకొనే (Deepika Padukone)అతిథి పాత్రలో మెరవబోతుందని తెలిసిందే. ఈ క్రేజీ మూవీలో షారుఖ్, దీపికా పదుకొనే కాంబోలో ఓ పాట కూడా ఉండబోతున్నట్టు తాజా అప్డేట్ చెబుతోంది.
Jawan | బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ ‘జవాన్’ (jawan). కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే జవాన్ షూటింగ్‌కు సంబంధించిన విజువల్ ఒకటి బయటకు కూడా వచ్చింది. షారుఖ్, నయనతార (Nayanthara)పై వచ్చే సాంగ్ షూట్ చేస్తున్న వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కాగా ఇప్పుడు మరో క్రేజీ లీక్ ఒకటి స్టిల్ రూపంలో బయటకు వచ్చింది. జవాన్‌లో దీపికా పదుకొనే (Deepika Padukone)అతిథి పాత్రలో మెరవబోతుందని తెలిసిందే.
ఈ క్రేజీ మూవీలో షారుఖ్, దీపికా పదుకొనే కాంబోలో ఓ పాట కూడా ఉండబోతున్నట్టు తాజా అప్డేట్ చెబుతోంది. షారుఖ్‌ఖాన్, దీపికా పదుకొనే పాట కోసం రిహార్సల్స్ చేస్తున్న స్టిల్ ఒకటి ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. సిల్వర్ స్క్రీన్‌పై షారుఖ్, దీపికా పదుకొనే కాంబో అంటే పక్కా హిట్టు అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ లెక్కన జవాన్ కూడా హిట్ లిస్ట్‌లో చేరిపోవడం ఖాయమైనట్టేననిపిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన జవాన్ టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. జవాన్‌లో షారుఖ్ ఖాన్ తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు.
తాజా అప్డేట్ ప్రకారం జవాన్ ఇవాళ్టితో షూటింగ్ పూర్తి చేసుకుంది. మే తొలి వారంలో జవాన్ టీజర్‌ను లాంఛ్ చేయబోతున్నట్టు టాక్. జవాన్‌లో నయనతార ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా నటించనున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని హోంబ్యానర్ రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై షారుఖ్ ఖాన్ తెరకెక్కిస్తున్నాడు. షారుఖ్ ఖాన్ మరోవైపు సల్మాన్ ఖాన్ లీడ్ రోల్లో నటిస్తున్న టైగర్ 3లో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. దీంతోపాటు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డుంకీ చిత్రంలో కూడా నటిస్తున్నాడు.
జవాన్ టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

