Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) టైటిల్ రోల్లో నటించిన చిత్రం శాకుంతలం (Shaakuntalam). గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతుంది. భారీ అంచనాల మధ్య విడుదల ఈ చిత్రం మూవీ లవర్స్ ను నిరాశకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా విషయంలో కొందరు నెటిజన్ల నుంచి వస్తున్న నెగెటివ్ కామెంట్స్ కు భగవద్గీతలోని శ్లోకాన్ని షేర్ చేస్తూ.. చెక్ పెట్టింది.
నీకు పని చెయ్యడం మీదే అధికారం ఉంది. దాని ఫలితం మీద మాత్రం లేదు. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు.అలాగే పని చెయ్యడం మానకూడదు. ప్రతిఫలం ఆశించకుండా పనులు చెయ్యి.. అని శ్లోకం అర్థాన్ని గుర్తుచేస్తూ.. శాకుంతలం ఫలితాన్ని ఉద్దేశించి పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మొత్తానికి కష్టపడి సినిమా చేయడం వరకే తన బాధ్యత. దాని ఫలితం ఎలా ఉన్నా.. తర్వాత చేయబోయే పనిఫై ఫోకస్ పెట్టడం ముఖ్యమని క్లారిటీ ఇచ్చేసింది సమంత.
సామ్ ప్రస్తుతం బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్‌తో చేస్తున్న సిటడెల్ వెబ్ సిరీస్ టీంతో జాయిన్ అయింది. వరుణ్ ధవన్ టీంతో ఇంగ్లాండ్‌లో దిగిన స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పుడీ స్టిల్స్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. సమంత మరోవైపు శివనిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఖుషిలో కూడా నటిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
Jawan | జవాన్ కోసం షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే రిహార్సల్స్
Virupaksha | విరూపాక్ష టీం ఎలా కష్టపడ్డారో చూడండి.. మేకింగ్ వీడియో