Abhishek Bachchan | చాలా కాలంగా బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న బీటౌన్ యాక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan). ఈ స్టార్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం ఐ వాంట్ టు టాక్ (I want to Talk). సుజిత్ సర్కార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నవంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా అభిషేక్ బచ్చన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాను ఈ సినిమా కోసం చేసిన ఓ పనిని జీవితంలో మళ్లీ ఎప్పటికీ చేయాలనుకోవడం లేదన్నాడు అభిషేక్ బచ్చన్. సినిమా గురించి మాట్లాడుతూ.. ఇదొక విభిన్నమైన కథ. సుజిత్ సర్కార్ కథ చెప్పగానే వెంటకనే ఓకే చెప్పాను. ఇందులో నా పాత్ర ఇదివరకెన్నడూ చూడని విధంగా ఉంటుంది. ఈ రోల్ కోసం చాలా బరువు పెరిగాను. ఇందులో కథానుగుణంగా నేను పొట్టతో కనిపిస్తా. ప్రోస్థటిక్ మేకప్ సాయంతో అలా కనిపించానని పలువురు అనుకుంటున్నారు.
కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదు. మేకప్ సాయం లేకుండా అలా కనిపించడానికి ఎంతో శ్రమించా. ఇకపై ఏ సినిమా కోసం కూడా బరువు పెరగకూడదని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఈ వయస్సులో బరువు తగ్గడం చాలా కష్టంతో కూడుకున్న విషయమని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట