ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన కేజీఎఫ్ ఇండస్ట్రీలో కలెక్షన్ల సునామి సృష్టించింది. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో హోంబలే ఫిలిమ్స్ సంస్థ పేరు మార్మోగిపోయింది. ఇదే సంస్థ నుంచి మరోసారి కేజీఎఫ్ చాఫ్టర్ 2 గత రికార్డులను తిరగరాసేందుకు వస్తోంది. హోంబలే ఫిలిమ్స్ మేకర్స్ నుంచి రేపు పెద్ద ప్రకటన రాబోతుంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ లీడ్ రోల్ లో భారీ చిత్రాన్ని ప్రకటించబోతుంది హోంబలే ఫిలిమ్స్.
పవన్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీ కన్నడతోపాటు తెలుగులో కూడా విడుదల కానుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలపై రేపు స్పష్టత రానుంది. జులై 1న ఉదయం 11:48 గంటలకు టైటిల్ ప్రకటించనున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది మేకర్స్ అండ్ టీం. ఇప్పటికే హోంబలే ఫిలిమ్స్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా నిర్మిస్తోంది.
ఇవి కూడా చదవండి..
చిరంజీవి సినిమాలో క్రేజీ బాలీవుడ్ స్టార్..!
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com