‘దీక్ష విరమించండి.. న్యాయం చేస్తా’
తమ ఇండ్లను కూలగొట్టి ఇండ్ల స్థలాలను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ గత నాలుగు రోజులుగా సుంకిశాల గ్రామస్తులు దీక్ష చేస్తున్నారు. మంగళవారం తాసీల్దార్ వారి వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకుని...
– నాంపల్లి తాసీల్దార్ ఆంజనేయులు
నాంపల్లి, సెప్టెంబర్ 15 : తమ ఇండ్లను కూలగొట్టి ఇండ్ల స్థలాలను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ గత నాలుగు రోజులుగా సుంకిశాల గ్రామస్తులు దీక్ష చేస్తున్నారు. మంగళవారం తాసీల్దార్ వారి వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకుని కబ్జాకు గురి అవుతున్న స్థలాన్ని గ్రామస్తులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో రికార్డులను పరిశీలించి శుక్రవారం లోపు జిల్లా కలెక్టర్, ఆర్ డి ఓ కి నివేదిక అందజేస్తానని, కబ్జాకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా తమ మాటపై నమ్మకం ఉంచి దీక్ష విరమించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాషిపాక రాములు, వార్డు సభ్యులు కలకొండ లక్ష్మయ్య, బుడిగపాక ధనమ్మ, వాడపల్లి లావణ్య, నేరేడుగోమ్ము సత్యనారాయణ, కాటిక ఇదెమ్మ, ఎడమ మల్లేష్, ఆంజనేయులు, దేవేందర్, హరీష్, కిరణ్, రమేష్, ఎర్రయ్య, లింగయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

