Kedarnath: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియులు.. 7350 యాత్రికులు సురక్షితంగా తరలింపు
Kedarnath: కేదార్నాథ్ ట్రెక్కింగ్ రూట్లో రెండు రోజుల క్రితం కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. మంగళవారం అక్కడ నుంచి సుమారు 150 మందిని రక్షించారు. దీంతో మొత్తం ఆ ప్రాంతం నుంచి 7350 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
రుద్రప్రయాగ్: ఉత్తరాఖండ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో .. కేదార్నాథ్(Kedarnath) మార్గంలో ఉన్న ట్రెక్కింగ్ రూట్లో రెండు రోజుల క్రితం కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. మంగళవారం అక్కడ నుంచి సుమారు 150 మందిని రక్షించారు. దీంతో మొత్తం ఆ ప్రాంతం నుంచి 7350 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ఈ విషయాన్ని ఇవాళ తెలిపింది. ఎస్ఈఓసీ రిపోర్టు ప్రకారం కేదార్నాథ్ థామ్ నుంచి తిరుగు ప్రయాణం అవుతున్న వారిని చిర్బాసా వద్ద రక్షించినట్లు తెలిపారు. ప్రస్తుతం చిర్బాసా వద్ద ఇంకా శిథిలాలను తొలగిస్తున్నారు. కొండ రాళ్లు కింద పడడం వల్ల .. రెండు రోజుల క్రితమే ట్రెక్కింగ్ మార్గాన్ని ఆపేశారు.
అయితే ఇవాళ మళ్లీ ఆ రూట్‌ను ఓపెన్ చేశారు. దీంతో పాటు హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. యాత్రికులతో పాటు సుమారు 1200 గుర్రాలను కూడా రక్షించారు. గౌరికుండ్‌కు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిర్బాసా హెలిప్యాడ్ సమీపంలో క్లియరెన్స్ పనులు చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన ఆ మార్గాన్ని ఓపెన్ చేసేందుకు పనిచేస్తున్నారు. అయితే చిర్బాసా మార్గాన్ని పూర్తిగా క్లియర్ చేసిన తర్వాతే యాత్రికులను ఆ మార్గంలో కేదార్నాథ్ పంపించనున్నారు. కాలినడకన వెళ్లే వారు సోన్‌ప్రయాగ్, గౌరికుండ్ వద్ద నిలిచిపోయారు.
जनपद रुद्रप्रयाग के चीरबासा में केदारनाथ पैदल मार्ग पर पहाड़ी से पत्थर गिरने के खतरे को देखते हुए प्रशासन के द्वारा हेलमेट पहनाकर यात्रियों को सुरक्षित निकाला जा रहा है।#Kedarnath #Rudraprayag #Uttarakhand pic.twitter.com/gf0ARrJA46
— Uttarakhand DIPR (@DIPR_UK) September 15, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

