కన్నడ హీరో యశ్ (Yash) లీడ్ రోల్ పోషించిన చిత్రం కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2). ఏప్రిల్ 14న గ్రాండ్గావరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ ను షేక్ చేస్తోంది. కాగా సినిమా స్క్రీనింగ్ టైంలో కర్ణాటకలోని ఓ థియేటర్లో జరిగిన సంఘటన ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. హవేరి జిల్లాలోని షిగ్గావ్ థియేటర్లో ఓ యువకుడు సినిమా చూస్తున్నాడు. వెనుక సీట్లో ఉన్న మరో వ్యక్తి ఆ యువకుడు కూర్చున్న సీటుపై కాలు పెట్టాడు.
దీంతో సదరు యువకుడు కోపంతో ఊగిపోతూ థియేటర్ నుంచి బయటకు వెళ్లాడు. కొద్ది సేపటికే ఓ తుపాకీతో థియేటర్‌కు వచ్చాడు. గన్‌తో ఆ వ్యక్తిపై మూడు సార్లు కాల్పులు (Gun Fire) జరిపాడు. ఈ ఘటనతో భయబ్రాంతులకు లోనైన ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే అదృష్టవశాత్తు బుల్లెట్లు తగిలిన వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడు. డాక్టర్లు బాధితుడి శరీరంలో నుంచి రెండు బుల్లెట్లు బయటకు తీయగా..మరొకటి కూడా తీసే ప్రయత్నంలో ఉన్నారు.
ప్రస్తుతం బాధితుడు మెల్లమెల్లగా కోలుకుంటున్నాడని డాక్టర్లు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. థియేటర్లలో ఇలా ఎవరూ ఊహించని విధంగా గన్ తీసుకురావడంతో యాజమాన్యం షాక్‌కు లోనైంది.
కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ నిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు చూసుకున్నాడు. తెలుగులో అవార్డులు అందుకున్న జెర్సీ మరి హిందీలో ఎలాంటి రికార్డులు సృష్టించిందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.