నిన్ను కోరి, మజిలీ ఫేం శివ నిర్వాణ (Siva Nirvana)- విజయ్‌దేవరకొండ (Vijay Devarakonda)తో కాంబోలో రాబోతున్న సినిమా నేడు గ్రాండ్‌గా లాంఛ్ అయిన విషయం తెలిసిందే. చెన్నై సుందరి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కాగా పూజా కార్యక్రమాల్లో డైరెక్టర్ శివ నిర్వాణతోపాటు హీరో, ముఖ్యఅతిథులు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఉన్నారు. కానీ మెయిన్ హీరోయిన్ సామ్ మాత్రం మిస్సయింది.
ఇంతకీ సామ్ సినిమా ప్రారంభ కార్యక్రమానికి రానంత బిజీగా ఉందా..? అసలు ఎక్కడికెళ్లి ఉంటుందని ఫ్యాన్స్ మధ్య తెగ చర్చలు నడుస్తున్నాయి. కాగా సామ్ ఎక్కడికెళ్లందనే విషయంపై నెట్టింట్లో చక్కర్లు కొడుతుఉన్న క్లారిటీ ఇస్తోంది. బ్యాక్ టు బ్యాక్ తెలుగు ప్రాజెక్టులను లైన్లో పెడుతున్న సామ్ ప్రస్తుతం హాలీడే ట్రిప్ లో ఉంది. ఇంతకీ ఈ భామ ఎక్కడికెళ్లిందో తెలుసా..? థాయ్‌లాండ్ (Thailand holiday). అక్కడ డిన్నర్ టైంలో తీసిన స్టిల్ ఒకటి ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సామ్.
ఈ ఫొటోతో అభిమానులు, ఫాలోవర్లలో ఉన్న అనుమానాలకు చెక్ పెట్టేసింది. ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh ravichander) మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయబోతున్నట్టు తెలుస్తోండగా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లైగర్ సినిమాతో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజయ్ దేవరకొండ . మరోవైపు పూరీ జగన్నాథ్‌తో జనగణమన సినిమా కూడా చేస్తున్నాడు.
#VijayDeverakonda #ShivaNirvana #SamanthaRuthPrabhu’s Next Launched. #VD11 is Produced by #MythriMovieMakers
Music by #Hridayam fame #Heshamabdulwahab
Shoot begins this month.#VD11Launch pic.twitter.com/kdRzxMe8e8
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) April 21, 2022