Raveena Tandon | రవీనాపై కాయిన్ల వర్షం..వీడియో షేర్ చేసిన కేజీఎఫ్ నటి 2
ప్రశాంత్ నీల్ (prashanthneel) డైరెక్షన్లో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటి రవీనాటాండన్ (Raveena Tandon) కీ రోల్లో పోషించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భారత ప్రధానమంత్రి రమీకా సేన్ పాత్ర (Ramikasen) లో నటించింది రవీనా.
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన తాజా ప్రాజెక్టు కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF Chapter 2). పాన్ ఇండియా కథాంశంతో ప్రశాంత్ నీల్ (prashanthneel) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటి రవీనాటాండన్ (Raveena Tandon) కీ రోల్లో పోషించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భారత ప్రధానమంత్రి రమీకా సేన్ పాత్ర (Ramikasen) లో నటించింది రవీనా. సినిమాలో చాలా వరకు సీన్లు రోమాలు నిక్కపొడుచుకునేలా సాగుతూ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.
బాక్సాపీస్ వద్ద రాబడుతున్న వసూళ్లు ఈ సినిమా రేంజ్ ఏంటో చూపిస్తున్నాయి. సినిమాకు ప్రతీ పాత్ర హైలెట్‌గా ఉండేలా డిజైన్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇక రవీనా టాండన్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించగానే.. ఆమె చెప్తున్న డైలాగ్స్ కు అరుపులు, కేకలతో థియేటర్లు దద్దరిల్లి పోతున్నాయి. సాధారణంగా థియేటర్లలో కాగితాలు విసరడం చూస్తుంటాం. కానీ కాయిన్స్ విసరడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇలాంటి దృశ్యాలు కెమెరా పడటం చాలా అరుదు. కర్ణాటకలోని ఓ థియేటర్లలో ఇదే జరిగింది.
Read Also : Upasana Langar Seva | షూటింగ్లో రాంచరణ్ బిజీ..గోల్డెన్ టెంపుల్లో ఉపాసన పూజలు..వీడియో
సినిమా రవీనాటాండన్ సీన్ రాగానే థియేటర్లలో ఉన్న ప్రేక్షకులు కాయిన్స్ విసురుతున్న వీడియో స్క్రీన్ షాట్‌ను రవీనాటాండన్ ట్విటర్ లో షేర్ చేసింది. తాను నటించిన కేజీఎఫ్ 2 సినిమాపై అంతులేని ప్రేమను చూపిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసింది. చాలా కాలం తర్వాత స్క్రీన్‌పైకి కాయిన్స్ ఎగరేయడం చూస్తున్నా..అంటూ ట్వీట్ చేసింది.
కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్లో తాను నటించిన చివరి షాట్వీడియోక్లిప్ను ఈ సందర్భంగా అందరితో పంచుకుంది రవీనాటాండన్. #sweetmememories #ghuskemaarenge (సినిమాలోరవీనా చెప్పే డైలాగ్) హ్యాష్ ట్యాగ్‌లను జత చేస్తూ..మీ ప్రేమకు ధన్యవాదాలు అని తెలిపింది.
Read Also : Jayesh Bhai Jordaar Trailer | కొత్త లుక్‌లో రన్ వీర్ సింగ్..ఫన్నీగా ‘జయేశ్ భాయ్ జోర్దార్’ ట్రైలర్
Read Also : Naga Chaitanya | తెరపైకి నాగచైతన్య పెళ్లి టాపిక్..చైతూ టీం క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

