చెన్నై భామ సమంత (Samantha)తో విడాకులు తీసుకున్న తర్వాత ఫిల్మ్ కెరీర్‌పై ఫోకస్ పెట్టాడు టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). అమీర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చద్ధా (Laal Singh Chaddha) సినిమాతో చైతూ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. ఇదిలా ఉంటే నాగచైతన్యకు సంబంధించిన ఓ వార్త ఇపుడు బీటౌన్‌లో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే మళ్లీ పెళ్లి (Remarriage). అవును మీరు చదివింది నిజమే. సామ్‌తో విడిపోయిన తర్వాత చైతూ ఒంటరిగా ఫీలవుతున్నాడని, త్వరలోనే మళ్లీ పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నాడని కథనాలు తెరపైకి వస్తున్నాయి.
అయితే దీనిపై చైతూ టీం కొట్టిపారేసినట్టు ఫిలింనగర్ ఓ వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. నాగచైతన్య, సమంత విడాకులకు సంబంధించిన చట్టపరమైన ఫార్మాలిటీస్ ఇంకా పూర్తి కాలేదట. మరి ఇలాంటి పరిస్థితుల్లో నాగచైతన్య పెళ్లి టాపిక్ తీసుకువచ్చి తొందరపడుతున్నారని చైతూ టీం పేర్కొన్నట్టు టాక్ నడుస్తోంది. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్ధా ఆగస్టు 11న విడుదల కానుంది.
నాగచైతన్య మరోవైపు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు. రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ముంబై భామ అవికాగోర్, మాళవికా నాయర్ ఇతర కీ రోల్స్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.